movies

హలో రామ్ హిట్టు కోసమే

గత ఏడాది ఉన్నది ఒకటే జిందగీతో షాక్ తిన్న రామ్ మళ్ళి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కుదురుగా కెరీర్ నిలవడం లేదు రామ్ కి. ఒక హిట్టు వస్తే ఆ వెంటనే రెండు మూడు పరాజయాలు పలకరిస్తున్నాయి. అందుకే ఈ సారి చాలా జాగ్రత్తగా స్కెచ్ వేసుకుని మరీ టైటిల్ నుంచి దర్శకుడి దాకా అన్ని హిట్ యాంగిల్ లో ఉండేలా చేసుకుంటున్నాడు. అందులో భాగంగా చేసిందే హలో గురు ప్రేమ కోసమే.

1991లో వచ్చిన నాగార్జున మ్యూజికల్ హిట్ నిర్ణయం సినిమాలో సూపర్ హిట్ సాంగ్ నుంచి తీసుకున్న లైన్ తో పెట్టిన ఈ పేరు ఇప్పటికే యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. రామ్ బర్త్ డే (మే 15 అంటే రేపు) సందర్భంగా దీని ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అనుపమ పరమేశ్వరన్ వెనుక బుద్ధిమంతుడిగా వెంట పడుతున్న రామ్ లుక్స్ లో కూడా కొంచెం కొత్తగా ఉండేలా ట్రై చేసినట్టు కనిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ ఎప్పటి లాగే క్యుట్ గా ఉంది.

నిజానికి ఇది అఖిల్ కోసం రాసుకున్న కథ అని ముందు నుంచి ప్రచారంలో ఉంది. నేను లోకల్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధరావు చెప్పిన లైన్ అఖిల్ ను కాని నాగ్ ని కాని అంతగా ఇంప్రెస్ చేయకపోవడంతో దిల్ రాజు దీన్ని రామ్ దగ్గరకు తీసుకెళ్ళినట్టు టాక్. కథ నచ్చి రామ్ ఒప్పుకున్నాడని సమాచారం. నిజానికి నాగార్జున సాంగ్ కాబట్టి ఈ టైటిల్ అఖిల్ కి సెంటిమెంట్ పరంగా కూడా కలిసి వచ్చేది.

కాని హలో చేదు అనుభవం ఇంకా వెంటాడుతూనే ఉంది. మళ్ళి హలో గురు అంటూ ఇంకో పేరు ఎందుకులే అనుకుని కూడా ఉండవచ్చు. గప్ చుప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ ద్వారా మాస్ లవ్ స్టోరీస్ ని బాగా డీల్ చేయగలను అని ప్రూవ్ చేసుకున్న నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించడం దీనికి మరో ప్లస్ పాయింట్

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment