movies news

ఇప్పటికైనా ఆలోచించాలి

రంగస్థలం 50 రోజులకు అతి దగ్గరలో ఉన్నా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి అన్నది నిజం. కాని నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వెబ్ సైట్ ఒరిజినల్ ప్రింట్ ని ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో పెట్టేసింది. అంటే నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డుగా చెప్పబడిన సినిమా కేవలం 45వ రోజే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీదకు వచ్చేసింది. నిజానికి నిర్మాతలు ఈ రేంజ్ సక్సెస్ ముందు ఊహించింది కాకపోవడం వల్ల గడువు విషయాన్ని లైట్ తీసుకుని ఒప్పందం చేసుకున్నారు. తీరా సినిమా ఎక్కడికక్కడ రికార్డులను ఊచకోత కోసేసింది.

తన ప్రమాణాల ప్రకారం అమెజాన్ ప్రైమ్ రాజీ పడకుండా చెప్పిన డేట్ కి టైం కి రంగస్థలం హై క్వాలిటీ రిజల్యుషన్ లో అందుబాటులో ఉంచేసింది. ఇది ఎంత లేదన్నా ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తమ దగ్గర ఉన్నా లేకపోయినా ఆన్ లైన్ లో వైరస్ లా పాతుకు పోయిన పైరసీ సైట్స్ లో ఇది తెల్లవారక ముందు నుంచే డౌన్ లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు ఉత్సాహవంతులు.

ఇకపై నిర్మాతలు అమెజాన్ లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది. నిన్న ఆదివారం హైదరాబాద్ మెయిన్ థియేటర్ సుదర్శన్ లో రంగస్థలం మొత్తం నాలుగు ఆటలకు గాను సుమారు 3 లక్షల దాకా గ్రాస్ ఇచ్చింది. అదే ప్రాంతంలో ఆడుతున్న మహానటి కంటే జస్ట్ ఐదారు వేలు తక్కువ వచ్చాయి అంతే. ఫస్ట్ షో అయితే ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. నా పేరు సూర్య, భరత్ అనే నేను కూడా అంత రాబట్టలేదు.

మరి అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలకు సినిమాలు అమ్మేసి త్వరగా వాటిని ఆన్ లైన్ లో పెట్టుకునే సౌలభ్యం కలిగిస్తే థియేటర్ కు మళ్ళి మళ్ళి రావాలి అనుకునే ప్రేక్షకుడు ఆలోచించే పరిస్థితి వస్తుంది. భరత్ అనే నేను కూడా ఇదే తరహాలో విడుదల కానుంది. అది 45 రోజులా లేదా అంత కన్నా తక్కువనా అనే క్లారిటీ రావాల్సి ఉంది. పైరసీ వీరులు మాత్రం అమెజాన్ సైట్ శాశ్వతంగా డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించకపోయినా టెక్నాలజీని ఉపయోగించి లాగేస్తున్నారు. ఇకనైనా అలోచించి నిర్మాతలంతా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వస్తే బెటర్

Comments

comments