reviews

సన్నీలియోన్ బయోపిక్ – స్పెషల్ రివ్యూ

పోర్న్ స్టార్ గా బాలీవుడ్ లోనే కాదు అన్ని బాషా సినిమా పరిశ్రమల్లో సంచలనం రేపిన సన్నీ లియోన్ బయోపిక్ ఎట్టకేలకు బయటికి వచ్చేసింది. కాకపోతే వెండితెర మీద కాకుండా బుల్లితెర మీద సన్నీ అసలు పేరు కరణ్ జీత్ కౌర్ పేరుతో మొదటి సీజన్ లో పది ఎపిసోడ్లు ఆన్ లైన్ లో విడుదల చేసారు. మొత్తం 3 గంటల 45 నిమిషాల నిడివి ఉన్న కరణ్ జీత్ కౌర్ వెబ్ సిరీస్  జీ 5 వీడియో స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక దాని గురించి మినీ రివ్యూలో ఎలా ఉందో చూద్దాం. ఇది పక్కాగా సన్నీ లియోన్ బయోపిక్.

 

తనే స్వయంగా నటించింది కాబట్టి వాస్తవాలు పూర్తిగా చూపించలేదు కానీ సాధ్యమైనంత మేరకు తన తప్పు లేకుండా పోర్న్ ప్రపంచంలోకి అవసరం కొద్దీ అడుగు పెట్టాల్సి వచ్చినట్టుగా చూపడం ఇటీవలే వచ్చిన సంజు తరహాలోనే అనిపిస్తుంది. రైసా సుజానియా సన్నీ బాగా వయసులో ఉన్నప్పటి పాత్ర పోషించగా తన మీద తీసిన సీన్లలో మొహమాటం లేకుండా నటించింది. కాళ్ళ మీద జుత్తుని షేవ్ చేసుకోలేదని ఎగతాళి చేసే సీన్స్ లో,  మొదటి ముద్దును అందుకున్నప్పుడు జీవించే ఎపిసోడ్ లో చక్కగా మెప్పించింది. తండ్రికి దొరికిపోయే క్షణంలో దర్శకుడు అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకున్నాడు.

 

సన్నీ లియోన్ నాన్నగా నటించిన బిజయ్ జస్జీత్ దానికి ప్రాణం పోసాడు.యాంత్రికంగా ఆలోచించే మైండ్ సెట్ తో కెనడా నుంచి లాస్ యంజిల్స్ కు వెళ్లాలనుకునే పాత్రలో సెటిల్డ్ గా కనిపిస్తాడు. తల్లిగా నటించిన గృషా సింగ్ కూడా బాగా ఒదిగిపోయింది. పంజాబీ యాసతో మెప్పించింది. కూతురిని కట్టడి చేయలేక మద్యానికి బానిసైన పాత్రలో మంచి నటన రాబట్టుకున్నారు. సన్నీ సోదరుడిగా నటించిన కరంవీర్ లాంబా పాత్రను డిజైన్ చేసిన తీరు ఆశ్చర్య పరుస్తుంది.

 

సన్నీ లియోన్ జీవితానికి సంబందించిన చీకటి రహస్యాలు తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి గా అతన్ని చూపించారు. సన్నీ మొదటిసినిమా స్కైన్ మ్యాక్స్ సంతకం చేసే సమయంలో ఆమె సంరక్షకుడిగా కనపడుతూనే సన్నీ ఫోటోలతో వ్యాపారం చేసే మరో షేడ్ లో చూపించడం షాక్ కలిగిస్తుంది.

 

ఇక సన్నీ లియోన్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పాత్రలో రాజ్ అరుణ్ మరో అసెట్. నేషనల్ ఛానల్ లో సన్నీని ఇబ్బంది పెట్టె ప్రశ్నలతో ఆడుకునే సీన్ లో బెస్ట్ ఇచ్చేసాడు. నిజ జీవితంలో సన్నీ ఫేస్ చేసిన జర్నలిస్ట్ భూపేంద్ర చౌబే పాత్రను ఈ రకంగా మలిచారు. ఇందులో కీలక పాత్రలు ఇవే.

 

ఇక సన్నీ లియోన్ విషయానికి వస్తే నటించడం కాదు తన ఆత్మ కథ కాబట్టి జీవించేసింది. సెట్స్ లో ఎదురుకున్న అవమానాలు ఛాలెంజులు సవాళ్లు అన్నింటిలోనూ నిజమైన నటిని బయటికి తీసుకొచ్చింది. ఒక సీన్ లో అనుపమ్ తనను ప్రాస్టిట్యూట్ కి పోర్న్ స్టార్ కి తేడా లేదు అని చెప్పినప్పుడు వెంటనే తేడా గట్స్ అంటే దమ్ము మాత్రమే అని చెప్పడం బాగా పేలింది.

 

ఎప్పుడు స్కిన్ షోతో మేనేజ్ చేసే సన్నీ ఇందులో మాత్రం నటికి పని చెప్పింది. ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ మొత్తం సన్నీ లియోన్ వైపు చెప్పారు కాబట్టి పాజిటివ్ యాంగిల్ మాత్రమే కనిపిస్తుంది.

 

సన్నీ ఇలా బట్టలు తీసేసి నటించడం విధి లిఖితం తప్ప మరొకటి కాదు అనేలా ప్రొజెక్ట్ చేయటం కేవలం సన్నీని మెప్పించడం కోసమే. కాకపోతే టేకింగ్ నిజాయితీ కనిపించింది. బోల్డ్ సీన్స్ బోలెడు ఉన్నాయి. రసిక ప్రియులు నిరాశ పడరు. తన జీవితంలో జరిగిన వాటిని సన్నీ చెప్పుకున్న తీరు ఆలోచనలో పడేస్తాయి.

 

వెబ్ సిరీస్ కాబట్టి స్లో గా అనిపించినా కథను చెప్పే క్రమం వీటిలో ఇలాగే ఉంటుంది కాబట్టి మరీ బోర్ అనిపించదు. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంచారు. సో హిందీ రాని వాళ్లకు అర్థం కాదన్న సమస్య లేదు. తీరిక బాగా ఉండి సన్నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment