movies

RRR ఎన్టీఆర్, చరణ్ పాత్రలు ఇవేనా..!

బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడని ఊహించిన అభిమానులకు మెగా నందమూరి మల్టీస్టారర్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. RRR అంటూ రాజమౌళి మెగా ప్లాన్ భారీగానే ఉందని చెప్పొచ్చు. చరణ్ తో మగధీర ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన రాజమౌళి. ఎన్.టి.ఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 నుండి యమదొంగ వరకు హిట్లు కొడుతూనే వచ్చాడు.

ఈ ఇద్దరి హీరోలతో రాజమౌళి సినిమా అంటే ఇక ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియదు. అయితే సినిమాలో చరణ్ హార్స్ రైడర్ గా కనిపిస్తాడట. ఎన్.టి.ఆర్ బాక్సర్ గా కనిపిస్తాడట. అందుకే ఎన్.టి.ఆర్ తన లుక్ మీద దృష్టి పెట్టాడు.

ఆ ఇద్దరు హీరోలు మాత్రం ఎవరికి వారు తమకు జక్కన్న కథ ఏమి చెప్పలేదని అన్నాడు. మరి అసలు వీరు ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నట్టే. ఇక ఈమధ్య స్టార్ హీరోల మధ్య సఖ్యత మరింత పెరిగింది. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రాగా ఆ ఈవెంట్ తర్వాత మహేష్, ఎన్.టి.ఆర్ లతో పాటు చరణ్ కూడా పార్టీలో జాయిన్ అయ్యాడు.

మొత్తానికి ఇండస్ట్రీలో కొత్తరకం ఆలోచనలతో మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్టార్లు ఎప్పుడు అలానే ఉంటారు కాని అభిమానులు మాత్రం ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. మరి ఇక నుండైనా సరే ఈ వ్యవహార శైలి మారుతుందేమో చూడాలి.

Comments

comments