movies

RX బ్యూటీ సెక్సీ షర్ట్ !!!

టాలీవుడ్ లో కొత్త తరహా బోల్డ్ కంటెంట్ కు అడుగులు వేగంగా పడుతున్నాయి. అర్జున్ రెడ్డితో దీనికి శ్రీకారం పడగా ఇప్పుడు అదే దారిలో మరికొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. అందులో ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకట్టుకున్న సినిమా RX 100. ట్రైలర్ తోనే యూత్ కి కనెక్ట్ అయిపోయిన ఈ మూవీలో హీరోయిన్ గా పాయల్ రాజపుత్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. టీవీ సీరియల్స్ లో మంచి పాపులారిటీ ఉన్న ఈ హాట్ బ్యూటీ గత ఏడాది పంజాబీ సినిమా చన్నా మెరియా ద్వారా తెరంగేట్రం చేసింది.

మరాఠి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ సైరాట్ కి ఇది రీమేక్. ఇప్పుడు దీని హిందీ వెర్షన్ ధఢక్ తోనే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ రంగప్రవేశం చేస్తోంది. ఎక్స్ పోజ్ చేయడానికి తాను ఏ మాత్రం మొహమాట పడనని ఆర్ఎక్స్ 100 ట్రైలర్ లోనే చూపించేసిన పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తనకు 2 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. వాళ్ళతో రెగ్యులర్ టచ్ ఉండటం కోసం ఏదో ఒక పిక్ షేర్ చేయటం రాజ్ పుత్ కు అలవాటే. అందులో భాగంగా వదిలినదే పైన ఫోటో.

అలా చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది. చొక్కాని అలా సగం వదిలేస్తే ఎలా మొత్తం తీసేయమని కదూ. తప్పు లేదు. ఫోజు అలా ఇచ్చినప్పుడు ఇలా అగగటం కూడా తప్పు కాదు. ఆర్ఎక్స్ 100 లో కూడా హీరోతో హాట్ సీన్స్ లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించిన పాయల్ తెలుగులో ఇది కనక బ్రేక్ ఇస్తే హ్యాపీ గా సెటిల్ అయిపోవచ్చు అని ఆశిస్తోంది.

జులై 5  విడుదల కానున్న ఆ మూవీ మీద హైప్ మెల్లగా పెరుగుతోంది . అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆ మూవీలో చాలా కాలం తర్వాత సీనియర్ తమిళ హీరో రాంకీ హీరో తండ్రిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయినా పాయల్  ఇలా అందాలు ఆరబోస్తే టాలీవుడ్ లో ఏం ఖర్మ ఏకంగా బాలీవుడ్ అవకాశాలకు కూడా గేలం వేయవచ్చు. పాయల్ ఫైనల్ టార్గెట్ అదేనట లెండి.

Comments

comments