movies

నాగచైతన్యతో గొడవ పడ్డ సమంత !

పెళ్ళయిన కొత్తల్లో అమ్మాయికి కోరికలు ప్రత్యేకంగా ఏముంటాయి చెప్పండి… భర్తతో కలిసి సరదాగా తిరగాలని, జంటగా ముద్దు ముచ్చట్లాడుతూ ఎంజాయ్ చేయాలని, షికార్లకి వెళ్ళాలని.. ఇంతకుమించి ఏముంటాయ్ చెప్పండి? పెళ్లయిన కొత్తల్లో ఆలూ మగలు ఇరువురూ ఒకరిపై ఒకరు ఒళ్లమాని ప్రేమానురాగాలతో ఉంటారు. సంసారం పాత బడుతున్నా కొద్దీ ఇతర వ్యాపకాలపై దృష్టి మళ్లుతుంది. అప్పటి వరకు ఇది సాధారణమే.. భర్త అంటేనే అటు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి, ఇటు సంసార ధర్మాన్ని పాటించాలి.. ఈ రెండిటి మధ్య నలిగిపోతాడు భర్త…ఇక సంసారం అన్నాంక చిలిపి అలకలు, చిలిపి చేష్టలు కామనేలెండి… ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న అనుమానాలు, మిస్ అండాస్టాండింగ్స్ కూడా ఉంటాయి…. నిజమే మరి.

కానీ అవన్నీ ఉంటేనే సంసారానికి నిండుదనం. ఉగాది పచ్చడిలో తీపి, చేదు, కారం, వగరు… ఇలా షడ్రుచుల్లా అవన్నీ ఉంటేనే కాపురం పదికాలాల పచ్చగా ఉంటుంది….ఇక భర్త గురించి బయటి వ్యక్తులు ఏమాత్రం కాస్త అనుమానం వచ్చే రీతిలో మాట్లాడినా చాలు….ఇక తనలో తను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ, కంగారు కంగారుగా భర్త మీద అనుమానం తో ఊగిపోతుంది భార్య…అది సహజమే అనుకోండి..మనం’ సినిమా మేకింగ్ నుంచే చైతూ సామ్ ల జంట జర్నీ స్టార్ట్ అయింది. అలా వీళ్ళిద్దరి ప్రేమాయణం లో భాగంగా సమంత కు కావలసిన ఇష్టమైన రకరకాల వంటకాలు చైతు తన స్వహస్తాలతో చేసి మరీ పెడుతుండేవాడట….అలా ఇద్దరూ ఎంజాయ్ చేసేవారు.. ఇక పెళ్ళి అయిన తరవాత సమంతా ఫ్రెండ్స్….ఓ…మాకు.. తెలీదా.. పెళ్ళికి ముందు అలాగే ఎవరైనా కాబోయే వారు (మగాళ్లు) అలాగే ఉంటారు?

నాలుగు రోజులు ఆగమ్మా.. అంతా బయటపడుద్ది.. అని ముఖాన్నే అనేశారట. అయితే వారు అన్నారని కాదు కాని ఎన్నాళ్లని ముద్దూ ముచ్చట్లతో కాలం వెళ్లదీస్తారు? పైగా నాగచైతన్య తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. ఇంకా నాగ్ వారసుడిగానే సినిమాల్లో చేస్తున్నాడు కాని తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకోలేదు. పైగా భార్య సమంతది ఇండివిడ్యువల్ గా టాప్ బ్రాండ్..ఇక అత్తగారైన అమల ఈ విషయం లో జోక్యం చేసుకొని అలా కాదమ్మా.. అని బుజ్జగించి గొడవ కాస్త పెద్దది కాకుండా సర్ది చెప్పిందట ఆమె….అత్తగారు అలా అత్త వారించడంతో కాస్త వెనక్కి తగ్గిందట అమ్మడు… ఇక నాగార్జున అయితే అటు చైతూని ‘నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు పోరాడు’ అని చెప్పలేక, ‘కొత్తగా వచ్చిన అమ్మాయికి కాస్త టైం ఇవ్వు’ అని కూడా అనలేక నలిగిపోయి సతమతం అయిపోతున్నాడని టాలీవుడ్ బేస్డ్ మీడియా కథనాల సారాంశం.

సో ఇకనైనా కాస్త ధ్యాసంతా పని మీదే కాకుండా కాస్తంత భార్య మీద కూడా పెట్టమని నాగచైతన్యకి సలహా ఇస్తున్నారు ఈ విషయం తెలిసిన వారు….అందుకే పెళ్లి తరువాత నాగచైతన్య కూడా సినిమా షూటింగ్ లని, వారి రిలీసింగ్ డేట్ లని ఎన్నెన్నో పనులతో రోజూ తెగ బిజీ.. బిజీగా తిరుగుతున్నాడట… పని బిజీలో తనకోసం ఖాళీ టైం కేటాయించలేకపోతున్న చైతూ మీద మొత్తానికి కోపం వచ్చిందట సమాంతకి….అయితే నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెల్లోస్తాను అని అన్నదట…ఒక్కొక్కరిగా ఈ విషయం ఇంట్లో అందరికీ పాకింది…

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment