news

‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ రివ్యూ :

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచిన ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి’కి రీమేక్‌ ఇది. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై ప్రముఖ హోమియోపతి వైద్యులు డా. రవికిరణ్‌ నిర్మాత గా , చరణ్‌ లక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఓ పక్క కమెడియన్ గా రాణిస్తూనే, మరోపక్క హీరోగా ఛాన్సులు కొట్టేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి.. ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ గా ఎలా అలరించాడో ఇప్పుడు చూద్దాం.

టైటిల్ : ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి ‘ (2017) 
స్టార్ కాస్ట్ : స‌ప్త‌గిరి, క‌శిష్ వోరా, సాయికుమార్ తదితరులు…
దర్శకత్వం : చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌
నిర్మాతలు: డా.ర‌వికిర‌ణ్‌
మ్యూజిక్ : బుల్గాని
విడుదల తేది : డిసెంబర్ 07, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

కథ :

ఎల్‌.ఎల్‌.బి పూర్తి చేసిన సప్తగిరి (సప్తగిరి) వూరులోని గొడవలను పరిష్కరిస్తాడు..కానీ కోర్ట్ లోని కేసులను పరిష్కారించడం లో విఫలం అవుతాడు. దీంతో ఈయనకు పెద్దగా కేసులేవీ రావు. ఇలా అయితే కుదరదని సిటీ కి వెళ్తే బాగా కేసులు వస్తాయని , తన టాలెంట్ ఏంటో బయటపడుతుందని అనుకున్న సప్తగిరి సిటీ కి వస్తాడు. ఆలా వచ్చి రాగానే ఓ హిట్‌ అండ్‌ రన్‌ కేసు సప్తగిరి కి ఎదురవుతుంది.

కానీ ఆ కేసు అప్పటికే రాజ్ పాల్ (సాయి కుమార్ ) కోర్ట్ లో కొట్టించేస్తాడు. అయినాగానీ దానిని మళ్లీ బయటకు తీసి దాని వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలని సప్తగిరి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమం లో ఆ కేసులో ప్రధాన సూత్రదారి రాజ్ పాల్ అని తెలుస్తుంది. దాంతో తనకు రూ. 20 లక్షలు ఇస్తే ఆ కేసును నుండి తప్పుకుంటానని , దానిని వదిలేస్తానని సప్తగిరి అంటాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? నిజంగానే సప్తగిరి ఆ డబ్బును తీసుకోని కేసును వదిలేసాడు..? లేక రాజ్ పాల్ ను చట్టినికి పట్టించాడా..అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* చివరి 40 నిముషాలు

* సాయి కుమార్, సప్తగిరి యాక్టింగ్

* పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్

మైనస్ :

* మ్యూజిక్

* పెద్ద కామెడీ లేకపోవడం

* ఫస్ట్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను తెగ నవ్విస్తున్న సప్తగిరి , హీరోగా కూడా రాణిస్తున్నాడు. మొదటి చిత్రం సప్తగిరి లో తనదయిన యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈయన , ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదరగొట్టాడు.

ముందు కామెడీతో త‌ర్వాత సీరియ‌స్‌గా సాగే పాత్ర‌లో త‌న‌దైన రీతిలో ఒదిగిపోయాడు. ఇక సెకండాఫ్‌లో రైతుల‌కు న్యాయం చేసే విధంగా పోరాడే స‌న్నివేశాల్లో స‌ప్త‌గిరి న‌ట‌న మెప్పిస్తుంది.
ముఖ్యంగా చివరి 40 నిమిషాలు పోటా పోటీగా నటించి అదరగొట్టాడు. కేవలం నటన పరంగానే కాదు డ్యాన్సులు ప‌రంగా కూడా మెప్పించాడు. ఫ్లోర్ డ్యాన్సులు , అదిరిపోయే స్టెప్స్ వేసి అబ్బో అనిపించాడు.

* రాజ్‌పాల్ లాయ‌ర్ పాత్ర‌లో సాయికుమార్ నట విశ్వరూపం చూపించాడు. చాల రోజుల తర్వాత సాయి కుమార్ తన డైలాగ్స్ తో థియేటర్స్ లలో ఈలలు వేయించాడు.

* ఇక జ‌డ్జ్ పాత్ర‌లో న‌టించిన శివ‌ప్ర‌సాద్ కూడా చాలా చ‌క్క‌గా చేశారు.

* హీరోయిన్ క‌శిష్ వోరా గురించి పెద్దగా చెప్పుకునేలా ఏమి లేదు.

* ఇక మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే ర‌వికాలే, గొల్ల‌పూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరాం మొదలగు వారు తమ తమ పరిధి లో బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* ఇక మ్యూజిక్ సినిమా కు పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి..అన్ని బాగానే చూసుకున్న దర్శక , నిర్మాతలు మ్యూజిక్ విషయం లో మాత్రం తప్పు చేసారు. అసలు ఆ పాటలు వస్తుంటే జనాలు బయటకు వెళ్ళుతున్నారు. విజయ్‌ బుల్గానిన్‌ అందించిన మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. లిరిక్స్ కూడా ఏ మాత్రం బాగాలేవు.

* పరుచూరి బ్రదర్స్‌ మాటలు సినిమాకు ప్రాణం పోసాయి. కోర్ట్ లో జరిగే సన్నివేశాలు అయితే ఓ రేంజి లో ఉన్నాయి. వాటికీ వారి మాటలే హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు.

* సారంగం ఎస్‌.ఆర్‌ ఫోటోగ్రఫి బాగుంది.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక దర్శకుడు చరణ్‌ విషయానికి వస్తే హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచిన ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి’ కథనే తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు తెరకెక్కించాడు. కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే అక్కడ ఎలా అయితే ఉన్నాయో అవే పెట్టాడు. కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్ని కూడా కరెక్ట్ గా ఉండేలా చూసుకున్నాడు. కాకపోతే మ్యూజిక్ విషయంలోనే కాస్త తడబడ్డాడు.

చివరిగా :

బాలీవుడ్‌లో ఘన విజయాన్ని సాధించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ని ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. ఫస్ట్ టైం చూసేవారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. సప్తగిరి , సాయి కుమార్ నటన సినిమాకు హైలైట్ అయ్యాయి, ముఖ్యం గా వీరి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. హీరోయిన్ పెద్దగా ఆకట్టుకోలేక పోవచ్చు. ఇక మ్యూజిక్ గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. డైరెక్టర్ చరణ్ మొదటి సినిమానే ఓ రీమేక్ కథను ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. తెలుగు నెగిటివిటి కి తగట్టు తెరకెక్కించాడు. ఓవరాల్ గా ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ – పాసైయ్యాడని చెప్పవచ్చు.

 

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment