movies news

మహానటి కులం ఏంటి ?

సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటికి ఒక పక్క ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుంటే మరోపక్క ఒక వర్గం మాత్రం సినిమా మీద ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయా ఎక్కడెక్కడ తప్పులు వెతుకుదామా అని అదే పనిగా పెట్టుకుంది. అందులో భాగంగానే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వేసిన సావిత్రి పెదనాన్న చౌదరి గారి వేషం గురించి ప్రస్తావిస్తూ అసలు చౌదరిలు కాని సావిత్రి కుటుంబంలో ఆయన ఎలా వచ్చాడు అని అడుగుతున్నారు.

దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇది. సావిత్రి గారి కుటుంబం పక్కా కాపులు. సావిత్రి గారి నాన్న చిన్నప్పుడే చనిపోతే సావిత్రి గారి పెద్దమ్మ ఇంటికి అంటే అక్కయ్య ఇంటికి తీసుకొస్తుంది అమ్మ. పెద్దమ్మ భర్త అంటే సినిమాలో చూపించిన చౌదరి గారు కమ్మ వర్గం. ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. అందుకే ఆయన పేరులో చౌదరి ఉంటుంది. సావిత్రి గారి ఇంటి పేరు నిస్సంకర. ఇది కాపు కమ్యునిటీలో ఉండే పేరు.

ఇక సావిత్రి గారి పెళ్లి చేసుకుంది అచ్చమైన తమిళ బ్రాహ్మణుడిని. అంటే మనం చూసిన జెమినీ గణేశన్. సో సావిత్రి గారి తల్లి కుటుంబం కాపు అయితే తన తల్లి అక్కయ్య పెళ్లి చేసుకున్న పెదనాన్న కమ్మ. ఆయనే సావిత్రి సినిమా జీవితానికి తొలినాళ్ళలో మార్గదర్శి. భర్త వీటికి పూర్తిగా విరుద్ధమైన బ్రాహ్మణ జాతి. అంటే తనకు తెలియకుండానే సావిత్రి గారు మూడు కులాల కుటుంబాల్లో ముఖ్య భాగం అయ్యారు.

సోషల్ మీడియాలో సావిత్రి గారి కులం గురించి రకరకాల కామెంట్స్ తో పాటు వివిధ పోస్ట్స్ వస్తున్న నేపధ్యంలో ఈ స్పష్టత ఇవ్వడం జరిగింది. సో సావిత్రి గారు ఒక వర్గానికో కులానికో పరిమితమైన వారు కాదు. వాటికి అతీతమైన సినిమా రంగంలో మహారాణిగా ఎదిగారు కాబట్టే అందరు అభిమానించే ప్రేమించే మహానటి అయ్యారు. ఆవిడ కులం గురించి ఇంత లోతైన విచారణ విశ్లేషణ చేయాల్సి రావడం నిజంగా విచారకరం.

Comments

comments