Business

ఎస్ బీఐ ఐఎస్ఎస్సీ కోడ్స్ మార్చింది ….

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. తన బ్యాంకు పరిధిలోని బ్రాంచులు అన్నింటి ఐఎఫ్ఎస్సీ కోడ్స్ అన్నీ పూర్తిగా మార్చేసింది. ఈ సమూల మైన మార్పు గురించి తెలియక పాత కోడ్స్ ప్రకారం ఎమౌంట్ సెండ్ చేశారో పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అసలే అన్నీ ఆన్ లైన్ ట్రాన్జాక్షన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత కీలకమైన కోడ్ విషయంలో జరిగిన లేటెస్ట్ డెవలప్ మెంట్ తెలియకుండా వ్యవహరిస్తే ఇక అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అందుకే అందరికీ అలర్ట్ చేసేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు స్టేట్ బ్యాంక్ ఇండియా నిర్వాహకులు.

భారతీయ స్టేట్ బ్యాంక్ తన అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న నేపథ్యంలో తన శాఖల నిర్వహణా తీరును సమూలంగా మార్చేస్తోంది. మొత్తం తన సాఫ్ట్ వేర్, ప్రోగ్రామింగ్ లోకి కొత్తగా విలీనమైన బ్యాంకుల కార్యకలాపాలు తెచ్చుకునేందుకు మార్పులు చేసేస్తోంది. దాదాపు ఈ ఛేంజింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ క్రమంలోనే బ్యాంకు బ్రాంచిని సూచించే 11 అంకెల ఐఎఫ్ఎస్సీ కోడ్ ను మార్చేసింది. వివిధ పట్టణాల్లోని స్టేట్ బ్యాంకు 1295 శాఖల పేర్లను, వాటి కోడ్స్‌ను, ఐఎ్‌ఫఎ్‌ససి కోడ్స్‌ను మార్చివేసింది. వీటి వివరాలను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

హైదరాబాద్‌, అమరావతి, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్‌, అహ్మదాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, చెన్నై, పట్నా, భోపాల్‌ తదితర సర్కిళ్లలోని శాఖల పేర్లు, వాటి కోడ్స్‌లో మార్పులు జరిగాయి. ఉదాహరణకు అమరావతి సర్కిల్‌లోని పూల బజార్‌ కర్నూల్‌గా ఉన్న పాత ఎస్‌బిఐ శాఖ పేరును కింగ్‌ మార్కెట్‌ కర్నూల్‌గా మార్చారు. పాత బ్రాంచ్‌ కోడ్‌ 21435 ఉండగా.. కొత్త బ్రాంచ్‌ కోడ్‌ 40699గా మార్చారు. పాత బ్రాంచ్‌ ఐఎ్‌ఫఎ్‌ససి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌21435 ఉండగా.. దీన్ని ఎస్‌బిఐఎన్‌40699గా మార్చినట్టు ఎస్‌బిఐ పేర్కొంది. అదే విధంగా హైదరాబాద్‌ సర్కిల్‌లోని మేడ్చల్‌ పాత శాఖ పేరును హైవే రోడ్‌ మేడ్చల్‌గా, బ్రాంచ్‌ కోడ్‌ను 11083 నుంచి 20091కి మార్చారు. దీని ఐఎ్‌ఫఎ్‌ససి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌11083 నుంచి ఎస్‌బిఐఎన్‌20091గా మారింది.

బ్యాంక్‌ శాఖ పేరు, బ్రాంచ్‌ కోడ్‌, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ వంటివి సేవింగ్‌ ఖాతా పాస్‌ పుస్తకం మొదటి పేజీలోనే ఉంటాయన్న విషయం తెలిసిందే. తాజా వివరాల కోసం కస్టమర్లు తమ బ్యాంక్‌ శాఖను సంప్రదిస్తే పూర్తి సమాచారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదును బదిలీ చేయడానికి బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ముఖ్యమైనదన్న విషయం తెలిసిందే. ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ లేకుండా ఆర్‌టిజిఎస్‌ (రియల్‌టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌), నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ర్టానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌), ఐఎంపిఎస్‌ (తక్షణ చెల్లింపు సేవ) లావాదేవీలు నిర్వహించడానిక అవకాశం ఉండదు.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment