news

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? ఈ ఒక్క విషయంలో జాగ్రత్తపడితే మంచి ఫోన్ దక్కించుకున్నట్టే!

స్టార్ట్‌ ఫోన్‌లపై అతిగా ఆధారపడుతున్న నేపథ్యంలో వాటిపై మరింత ఒత్తిడి పెరిగి బ్యాటరీ త్వరగా డ్రెయిన్‌ అవ్వడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితులలో ఫోన్‌లను మరింత వేగంగా చార్జ్‌ చేసుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను యూజర్లు అన్వేషిస్తున్నారు.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసి చార్జింగ్‌ సాకెట్‌ను కనెక్ట్‌ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఫోన్‌ ఛార్జ్‌ పూర్తవుతుంది.

ఫోన్‌ చార్జ్‌ చేస్తున్నప్పుడు గేమ్స్‌, బ్రౌజింగ్‌ వంటి యాక్టివిటీలకు దూరంగా వుండడం మేలు. ఎందుకంటే చార్జింగ్‌ అవుతున్న ఫోన్‌కు విశ్రాంతి అనేది అవసరం ఉంటుంది.
ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు హీట్‌ సెన్సిటివ్‌ కావున చార్జ్‌లో వుంచినప్పుడు ఫోన్‌ కేస్‌ను తొలగించడం మంచిది. దీంతో చార్జింగ్‌ వేగం మరింత పెరిగే అవకాశం ఉంది.

అనేకమంది ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను పవర్‌ బ్యాంక్‌, యూఎస్బీ అవుట్‌ లెట్స్‌తో చార్జ్‌ చేస్తుంటారు. ఇలా చేయడం సరైన చర్య కాదంటున్నారు నిపుణులు.

వాల్‌ ఛార్జర్‌తో ఆండ్రాయిడ్‌ను చార్జ్‌ చేయడం ద్వారా ఎఫెక్టివ్‌ ఫలితాలను వినియోగదారులు పొందవచ్చు.

ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌…వంటి వాటిలో సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలుచేసే ముందు సెల్లర్‌ను సంప్రదించడం ఉత్తమం.

సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేముందు ఆ ఫోన్‌కు సంబంధించిన బిల్స్‌తో పాటు యాక్సెరీస్‌, ఐఎంఈఐ నంబర్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోవడం మర్చిపోవద్దు.

ఎంపిక చేసుకోబోయే సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై స్పందిస్తుందనేది చూసుకోవడంతో పాటు మోడల్‌ వివరాలు, తర్వాత వచ్చే వెర్షన్‌ అప్‌డేట్‌లు అందుకునే అవకాశం వుందా లేదా అనేది చూసుకోవాలి. అదేవిధంగా ర్యామ్‌ సామర్థ్యం ఏ మేరకు ఉంది, ప్రాసెసర్‌ వేగం తెలుసుకోవాలి. అన్ని వివరాలను ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే రివ్యూల సహాయంతో చెక్‌ చేసుకోవడం మంచిది.

ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వుండాలంటే విక్రయిస్తున్న వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం మంచిది. విక్రయిస్తోన్న వ్యక్తికి మంచి రెప్యూరేషన్‌ ఉంటేనే ఫోన్‌ కొనుగోలు చేయడం ఉత్తమం.

ఎంపిక చేసుకున్న ఫోన్‌ కనీసం 2 జీబీ, 1 జీబీ ర్యామ్‌ను కలిగి ఉండేదిలా చూసుకోవాలి. అదేవిధంగా ప్రాసెసర్‌ విషయానికొస్తే క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ మంచి ఆప్షన్‌.

సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనుగోలు చేసేముందు ఫోన్‌ను నిశితంగా పరిశీలించండి. డిస్‌ప్లే, కెమెరా, కీప్యాడ్‌, చార్జింగ్‌ పోర్ట్‌, సిమ్‌ స్లాట్‌, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్‌…వంటి భాగాలు చురుకుగా స్పందిస్తున్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. ఫోన్‌ స్పీకర్స్‌తో పాటు సౌండ్‌ క్వాలిటీని చూసుకోవాలి. సిమ్‌ కార్డు సక్రమంగా పనిచేస్తోందో లేదో చూడాలి.

ఇటీవల నూతన మోడల్స్‌ విరివిగా వస్తున్నాయి. వినియోగదారులు రెండు, మూడు నెలలు వాడిన తర్వాత సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లో ఫోన్‌ను అమ్మకానికి పెడుతున్నారు. అలాంటప్పుడు ఫోన్‌ గ్యారంటీ గురించి వివరాలను పక్కాగా తెలుసుకోవల్సి ఉంటుంది. సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ ఫోన్‌లకు గ్యారంటీ ఎక్కువగా ఉండకపోవచ్చు.

ఎంపిక చేసుకున్న సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ ఇప్పటికీ మార్కెట్లో లభ్యమవుతున్నట్టయితే మీరు కొనుగోలు చేసే ధరకు అనుకూలమైతే సెకండ్‌హ్యాండ్‌ యూనిట్‌కు బదులుగా కొత్త మొబైల్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం.

Comments

comments