Business

వాట్సాప్ లో ఈ రహస్యమైన ఫీచర్లు !!

ఫేస్ బుక్, వాట్సాప్ లాంటివి లేకుండా నేడు మన రోజు గడవట్లేదు. అంతలా అవి మన జీవితంలో మమేకమైపోయాయి. మనం రోజూ వాడుతున్న వాట్సాప్ లోనే మనకు తెలియని కొన్ని ఇబ్బందులుంటాయన్న సంగతి మీకు తెలుసా..? ఉదాహరణకు వాట్సాప్ లో మీరు ఎవరికో పొరపాటున ఓ మెసేజ్ పంపారు. తిరిగి దాన్ని డిలీట్ చేసేశారు. ఇక దాన్ని వాళ్లు చదవలేరని అనుకుంటున్నారు కదూ. అది నిజం కాదు. మీరు డిలీట్ చేసిన మెసేజ్ ని అవతలి వాళ్లు చదవగలరు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మన సౌలభ్యం కోసం ఈమధ్యే వాట్సాప్ కొత్త ఆప్షన్ తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మనం పంపిన మెసేజ్ ను డిలీట్ చేసే సదుపాయం కల్పించింది. అందువల్ల పొరపాటున పంపిన మెసేజ్ ను మనం 7 నిమిషాల్లోపు డిలీట్ చేసేయవచ్చు. ఇక అవతలి వాళ్లకు అది కనిపించదని మనం అనుకుంటున్నాం. ఐతే, కొత్తగా తెలిసిన విషయమేంటంటే, డిలీట్ చేసిన మెసేజ్, అవతలి వాళ్ల మొబైల్ లో అలాగే ఉంటోంది. దాన్ని ఈజీగా వాళ్లు చదివే ఛాన్సుంది.

 డిలీట్ చేసిన మెసేజ్ లు మొబైల్ లోని ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ రిజిస్టర్ లో అలాగే ఉంటున్నాయని స్పెయిన్ కి చెందిన ఆండ్రాయిడ్ బ్లాగ్, ఆండ్రాయిడ్ జీఫీ తేల్చి చెప్పేసింది. మనం పంపిన మెసేజ్ ను మనం డిలీట్ చేసేసినా, అవతలి వాళ్లు నోటిఫికేషన్ లోకి వెళ్లి మనం ఏం పంపామో, ఎందుకు డిలీట్ చేశామో ఈజీగా తెలుసుకోగలరు.

ఎవరైనా మనకు పంపిన మెసేజ్ ని డిలీట్ చేస్తే, దాన్ని మనం ఎలా చదవాలో తెలుసా? సింపుల్… గూగుల్ ప్లేలో నోటిఫికేషన్ హిస్టరీ అనే థర్డ్ పార్టీ యాప్ ఉంది. దాన్ని డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ రిజిస్టార్ లోని మెసేజ్ లను సెర్చ్ చేయవచ్చు. అసలీ యాప్ లేకుండా కూడా నోటిఫికేషన్ లాగ్ ని కూడా చూడొచ్చు.

ఇది చూడాలంటే, హోమ్ స్క్రీన్ ని కొన్ని క్షణాలపాటూ ప్రెస్ చెయ్యాలి. అప్పుడు కనిపించే విడ్జెట్స్ పై టచ్ చెయ్యాలి. యాక్టివిటీస్ లోకి వెళ్లాలి. అక్కడి సెట్టింగ్స్ లోకి వెళ్తే నోటిఫికేషన్ లాగ్ కనిపిస్తుంది.
నోటిఫికేషన్ లాగ్ లో టెక్ట్స్ మెసేజ్ లు మాత్రమే ఉంటాయి. అవి కూడా పర్మనెంట్ గా ఉండవు. మొబైల్ ని రీస్టార్ట్ చేస్తే, మెసేజ్ లు క్లియర్

అయిపోతాయి. అంతేకాదు మెసేజ్ లోని మొదటి 100 కేరక్టర్లు మాత్రమే ఈ లాగ్ లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ 7 అంతకంటే లేటెస్ట్ వెర్షన్ మొబైళ్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉంది. ఏదేమైనా, వాట్సాప్ తెచ్చిన డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ లో ఇంత పెద్ద బ్లండర్ ఉంది. అందుకే మెసేజ్ పంపాక ఫీలయ్యేకంటే, పంపకముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మరి..!

Comments

comments