health

సెక్స్ లేక‌పోతే భార్య‌- భ‌ర్త‌లు విడిపోతారా..?

సెక్స్ అనేది బూతు కాద‌ని దంప‌తుల‌కు ఓ దివ్యఔష‌ద‌మ‌ని సెక్సాల‌జిస్ట్ లు, సైంటిస్ట్ లు చెబుతున్నారు. నేటి కంప్యూట‌ర్ యుగంలో భ‌ర్త‌ల్ని భార్య‌లు హ‌త్య‌లు చేయ‌డాలు, సెల‌బ్రిటీలు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు సెక్స్ కూడా ఓ కార‌ణ‌మ‌ని అంటున్నారు. సాధార‌ణంగా సెక్స్ అనేది మ‌న శ‌రీరానికి వ్యాయామం ఎంత అవ‌స‌ర‌మో, మ‌న‌సుకు సెక్స్ కూడా అంతే అవ‌సరం. అందుకే భార్య భ‌ర్త‌లు సెక్స్ లో పాల్గొనాలని, తద్వారా దాంప‌త్య జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. వీటితో పాటు సెక్స్ కు సంబంధించి ప‌లు సూచ‌న‌లిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఇద్ద‌రు మ‌న‌షుల మ‌ధ్య సాన్నిహిత్యం సెక్స్ ద్వారా పెరుగుతుంద‌ని సెక్సాల‌జిస్ట్ లు స‌ల‌హా ఇస్తున్నారు.

శ‌రీరం – ఆత్మ – మ‌న‌స్సు ఒకే విధంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యం ఉండ‌గలుగుతాం. అలా ఒకే తాటిపై తెచ్చేందుకు స‌హ‌క‌రించేదే సెక్స్.  ఒక‌రికొక‌రు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో సెక్స్ లో పాల్గొన‌డం వ‌ల్ల ఆనందంతో పాటు మీ బంధాలు దృఢంగా ఉంటాయి. విడిపోవ‌డాలు, కోట్లాడుకోవ‌డాలు ఇలాంటివి ఉండ‌వ‌ని చెబుతున్నారు.

ఒత్తిడిని దూరం చేసే మెడిసినే ఈ సెక్స్. అందుకే భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఒత్తిడిని న‌యం చేసి, సానుకూల వాతావ‌ర‌ణాన్ని క‌లిగించేలా చేస్తుంది. అందుకే దంప‌తుల మ‌ధ్య సెక్స్ చాలా అవ‌స‌రం. ఎక్కువ‌గా పాల్గొన్నా భార్య‌- భ‌ర్త‌ల మ‌ధ్య‌బంధం కూడా దృఢంగా మారుతుంది.
నేటి కాలంలో భార్య‌- భ‌ర్త‌మ‌ధ్య ఒత్తిడి విప‌రీతంగా ఉంటుంది. అలాంటి సమ‌యాల్లో మీ భాగ‌స్వాముల‌తో సెక్స్ లో పాల్గొనాల‌ని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ అనేది చాలా సున్నిత‌మైన అంశం. ఒత్తిడి ఉన్న స‌మ‌యాల్లో సెక్స్ లో పాల్గొంటే ఒత్తిడి మ‌టుమాయం అవుతుంది. ఒత్తిడి ఉంటే అన్నీర‌కాల అనారోగ్య‌స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డుతుంటాయి.
బాధలు – ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు మీరు తప్పక మీ భాగస్వామితో సెక్స్లో పాల్గొంటూ ఉండాలి.

భార్య‌- భ‌ర్త‌లు విప‌రీతంగా సెక్స్ లో పాల్గొన‌డం వ‌ల్ల ప్రేమ తారాస్థాయికి చేరుకుంటుంది.  మీరు, మీ భాగస్వామితో మరింత ప్రేమను ఆస్వాదించాలనుకుంటే మీరు ఎక్కువగా సెక్స్ లోఓ పాల్గొంటూ ఉండాలి, ఇది మీ మధ్య ప్రేమను పెంపొందిస్తుంది. సెక్స్ కారణంగా మీ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ల ప్రభావం ఒకరి మీద మరోకరు ఎక్కువ ప్రేమను కలిగి వుండేటట్లుగా చేస్తుంది.

Comments

comments