health

పడుకొనే ముందు ఇలా చేస్తే చాలు, మీ వీర్యకణాలు …

హై టెక్ జీవనం మనిషి ఓ చోట కుదురుగా కూర్చోలేక పోతున్నాడు.. పని ఒత్తిడి ఎక్కువ .. ఇంటికి వచ్చిన కూడా మళ్ళి లాప్ టప్ లు ముందు వేసుకొని పని చేస్తున్నారు..దాంతో ఎప్పుడో గాని నిద్రపోతున్నారు .. మళ్ళి పొద్దునే ఎప్పుడో గాని నిద్ర లేస్తున్నారు .. ఇలాంటి వారికీ నిద్రలేమి వచ్చే అవకాశాలు ఉన్నాయి నిపుణులు చెపుతున్నారు ..నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ కూడా రుజువైంది. ఇప్పుడు ఇదే విషయం పై మళ్ళి ఓ కొత్త విషయం బయట పడింది ..

నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. నిద్రపోయిన వారిలో వీర్య నాణ్యత లేనట్లుగా , 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు ఈ పరిశోధనలో తేలింది ..6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హనికరమట . ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్‌ స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం..టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల వంటివి కనీసం 45 నిమిషాల ముందే కట్టేయటం.. నిద్ర పోవటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం.. గదిలోఎక్కువ కాంతి ఉండే లైట్లు లేకుండా చూసుకోవటంమంచిది అంటున్నారు .

Comments

comments