health

వేళకాని వేళలో శృంగారం లో పాల్గొంటే ..మీ శరీరంలో జరిగే భయంకరమైన మర్పులేంటో

ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని ఆకర్షించే అంశం కామం. ఒక జీవి మరో జీవిని పునర్త్పత్తి చేయాలి అంటే సృష్టి కార్యమైనా లైంగిక సంపర్గం అన్నది అవసరం. అయితే, ఈ లైంగిక సంపర్గం అన్నది మాములుగా జరిగితే ఒకే. అలా కాకుండా ఓ అమ్మాయిని చూసి మోహించి ఆ అమ్మాయితో ఎలాగైనా లైంగిక సంపర్గం పెట్టుకోవాలని అనుకుంటే మాత్రం దానివలన చాలా ఇబ్బందులు వస్తాయి.

ఇక కాలానికి, కామానికి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. కొందరు ఎప్పుడు పదిట్ అప్పుడు కామదాహంతో రగిలిపోతుంటారు. తమ కామాన్ని తీర్చుకోవడానికి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా అకాల కామం అన్నది అనర్ధాలు తీసుకొస్తుంది. కామానికి దాసులై ఎందఱో నాశనమైనారు. వారి గురించిన కథలు పురాణాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

అనగనగా భోజ వంశానికి చెందినా దాండక్యుడు అనే రాజు ఉండేవాడు. అతడికి కామదాహం ఎక్కువ. అందమైన స్త్రీలు కనిపిస్తే.. అనుభవించే వరకు నిద్రపోడు. ఇలా ఎందరినో వారి రాజ్యంలోని స్త్రీలను చెరబట్టాడు. ఇక ఓ రోజు ఈ రాజు వేటకోసం అడవికి వెళ్తాడు. వేటల్లో బాగా అలసిపోవడంతో.. దగ్గరలో ఉన్న భార్గవ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు.

అయితే అప్పటికే భార్గవ మహర్షి అక్కడ ఉండడు. మహర్షి కుమార్తె ఉంటుంది.చిన్న వయసులో ఉన్నా ఆ మునికన్యే అతి సుందరంగా ఉండటంతో ఆమెను బలవంతంగా రథంపై ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. ఇక ఆశ్రమానికి వచ్చిన భార్గవ మహర్షి కుమార్తె కనిపించకపోయే సరికి దివ్యదృష్టి సారించి చూస్తాడు. విషయం అర్ధమవుతుంది. మహర్షి ఆగ్రహోదగ్రుడై బంధుమిత్ర సపరివార సమేతంగా నశించిపొమ్మని శపిస్తాడు. దండాక్యుడు అంతరించిపోయిన ప్రదేశమే.. ఇప్పటి దండకారణ్యం.

ఇక, అహల్య.. గౌతమ మహర్షి భార్య. పురుషులను దాసోహం చేయించే అందం ఆవిడది. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సైతం ఆ అందం మాయలో పడ్డాడు. ఆమెను కామించాడు. మహర్షి లేని సమయంచూసి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను అనుభవించాడు. ఆ క్రీడ అలా సాగుతుండగానే గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. స్త్రీ తనను సంతృప్తి పెట్టిన పురుషుడికి ప్రాణం ఇస్తుంది. ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అహల్య అలాగే చేసింది. భర్త కంటపడకుండా ఇంద్రుణ్ణి తన గర్భంలో దాచిపెడుతుంది.

అయితే, అదే సమయంలో గౌతముడికి పిలుపు వచ్చింది.భార్యను కూడా వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. గౌతముడిని ఆహ్వానించిన వ్యక్తి సామాన్యుడు కాడు. అహల్యను చూడగానే దివ్యదృష్టితో అసలు విషయం తెలుసుకున్నాడు. మూడు ఆసనాలు సిద్ధం చేశాడు. రెండు చాలు కదా. మూడోది ఎవరికి అని గౌతముడికి సందేహం కలిగి యోగ దృష్టితో చూశాడు. అహల్య రహస్యం బయటపడింది. ఇంద్రునిపై పట్టరాని కోపం వచ్చింది. సహస్ర భగడవుకమ్ము అని శపించాడు. కామాంధుడై పర పురుషుని భార్యను రమించినందుకు ఒళ్ళంతా స్త్రీ జననాంగాలై ఇంద్రుడు దురవస్థ పొందాడు.

పురాణాల్లో ఇలాంటి లెక్కలేనన్ని. సీతను చెరబట్టిన రావణాసురుడు, ద్రౌపదిని బలాత్కరించిన కీచకుడు ఏమైపోయారో, ఎలాంటి చావు చచ్చారో అందరికి తెలుసు. కామం వల్ల ముప్పు తప్పదు. కామాన్ని అదుపులో పెట్టుకోవడం వరకు సరే. కాని, కామాన్ని అణిచివేయాలని చూడకూడదు. ఆరోగ్యానికి, సంభోగానికి సంబంధం ఉంది. సంభోగం నెరవేరితేనే ఆరోగ్యంగా ఉంటారు. కామవంచాను అణిచిపెట్టాలని చూస్తె.. మతిబ్రమించే ప్రమాదం ఉందట.

Comments

comments