Sports

షాంఘై మాస్టర్స్ ట్రోఫీని గెల్చుకున్న ‘ఫెడరర్’

షాంఘై మాస్టర్స్ ఫైనల్లో రోజర్ ఫెడరర్ తన చిరకాల ప్రత్యర్థి, వరల్డ్ నెంబర్ వన్ , టాప్ సిడెడ్ అయిన రఫెల్ నాదల్ తో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫెదరర్ 6-4 6-3 వరుస సెట్లలో విజయం సాధించాడు.

కేవలం 72 నిమిషాల్లో ఫెడరర్ ఈ మ్యాచ్ ను ముగించాడు. అలాగే 10 ఏస్ తో మరియు నాదల్ కు ఒక్కసారి కూడా తన సర్వీస్ లో బ్రేక్ పాయింట్ ఇవ్వలేదు అలాగే నాదల్ సర్వీసును ఫెదరర్ మూడు సార్లు బ్రేక్ చెయ్యటం విశేషం. ఈ విజయంతో ఫెడరర్ ఈ ఏడాది తన ఖాతాలో ఆరో టైటిల్ ని జమచేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో విజేయతగా నిలిచిన ఫెడరర్ కు 11,36,850 డాలర్లు ( 7 కోట్ల 36 లక్షలు ) ప్రైజ్ మనీ అలాగే రన్నరప్ గ నిలిచిన నాదల్ కు 5,57,000 డాలర్లు ( 3 కోట్ల 60 లక్షలు ) ప్రైజ్ మనీ అందచేశారు.

నాదల్ పై ఫెడరర్ కి ఇది వరుసగా 5 విజయం కావటం విశేషం కానీ ఈ ఇద్దరు మొత్తం మీద 38 సార్లు తలపడగా 23 మ్యాచ్లలో నాదల్ అలాగే 15 మ్యాచ్లలో ఫెడరర్ విజయం సాధించారు. ఫెడరర్ కెరీర్ లో ఇది 94వ టైటిల్ కావటం విశేషం దీంతో ఎక్కువ టైటిల్స్ సాధించిన వాళ్ళలో ఫెడరర్ ఇవాన్ లెండిల్ తో కలిసి రెండో స్థానంని పంచుకుంటున్నాడు అలాగే మొదటి స్థానంలో 109 టైటిల్ విజయాలతో జిమ్మీ కానర్స్ ఉన్నాడు.

Comments

comments