Business

గూగుల్ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు

ఇంటర్నెట్ యూజర్లు మెచ్చుకున్న బెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్‌సైట్ గూగుల్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్ గా గూగుల్ గుర్తింపు సొంతం చేసుకుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గూగుల్‌కు సంబంధించి 30 ఆసక్తికర వాస్తవాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు…

గూగుల్ సెర్చ్ ఐడియాను

వాస్తవానికి గూగుల్ సెర్చ్ ఐడియాను లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు $1 మిలియన్ కు అమ్మేద్దామనుకున్నారట. కానీ ఆ ఆలోచనను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో వీరే స్వయంగా గూగుల్ ను ప్రారంభించి ఓ సంచలనాన్ని సృష్టించారు.

 

గూగుల్ అసలు పేరు

 

గూగుల్ అసలు పేరు Googol

గూగుల్ తమ హైరింగ్ ప్రక్రియను

 

గూగుల్ తమ హైరింగ్ ప్రక్రియను క్రెయిడ్ సిల్వర్‌స్టియిన్ తో ప్రారంభించింది.

 

ఆఫర్‌ను యాహూ తిరస్కరించింది

 

1997లో గూగుల్ ను కొనుగోలు చేసే ఆఫర్‌ను యాహూ తిరస్కరించింది.

గూగుల్ నిక్ నేమ్ ఏంటో తెలుసా

 

గూగుల్ నిక్ నేమ్ ఏంటో తెలుసా “Mountain View Chocolate Factory”

 

ఆదాయంలో 97శాతం

గూగుల్‌కు వచ్చే ఆదాయంలో 97శాతం ప్రకటనల ద్వారా వచ్చేదే.

 

గూగుల్‌కు గట్టి పోటినిస్తోన్న కంపెనీ‌ల వివరాలు

 

గూగుల్‌కు గట్టి పోటినిస్తోన్న కంపెనీ‌ల వివరాలు.. మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్ బుక్, మొజిల్లా

 

ఏ విధమైన డ్రెస్‌కోడ్ ఉండదు

 

గూగుల్ ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగులకు ఏ విధమైన డ్రెస్‌కోడ్ ఉండదు.

 

గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన అసాధారణ ఇంటర్‌ఫేస్

గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన అసాధారణ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ఏ ఇతర వెబ్‌సైట్ లోడ్ చేయనంత వేగంగా (0.5 సెకన్లు అంతకన్నా తక్కువ సమయంలో) గూగుల్ వెబ్ పేజీలనులోడ్ చేస్తుంది.

 

ఏదైనా శోధనా ప్రశ్నకు

 

ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్ 200 కారకాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఒక్క సెకను కాలంలో అత్యుత్తమ అవుట్పుట్‌ను విడుదల చేస్తుంది.

 

గూగుల్ తన స్ట్రీట్ వ్యూ మ్యాప్స్ ఫీచర్ కోసం

 

గూగుల్ తన స్ట్రీట్ వ్యూ మ్యాప్స్ ఫీచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మైళ్ల రోడ్డు మార్గాన్ని ఫోటోల ద్వారా చిత్రీకరించింది.

91 శాతం గూగుల్ రెవెన్యూలో 55.5 బిలియన్ డాలర్ల ఆదాయం

2013కు గాను 91 శాతం గూగుల్ రెవెన్యూలో 55.5 బిలియన్ డాలర్ల ఆదాయం కేవలం ప్రకటనల ద్వారానే వచ్చింది.

 

మిల్లీసెకన్ల వ్యవధిలోనే 5,300,000,000 ఫలితాలను గూగుల్ మీముందు ఉంచుతుంది

మీరు గూగుల్ సెర్చ్ పేజీలో ఫేస్‌బుక్ అని టైప్ చేసినట్లయితే కొన్ని మిల్లీసెకన్ల వ్యవధిలోనే 5,300,000,000 ఫలితాలను గూగుల్ మీముందు ఉంచుతుంది.

 

ఒక్క సెకను కాలంలో 40,000 శోధనా ప్రశ్నలు

 

సగటను ఒక్క సెకను కాలంలో 40,000 శోధనా ప్రశ్నలు గూగుల్‌లో ప్రాసెస్ కాబడతాయి.

 

గూగుల్ శోధన సూచిక (సెర్చ్ ఇండెక్స్) 100 మిలియన్ గిగాబైట్లు అంతకన్నా ఎక్కువ సైజును కలిగి ఉంటుంది

గూగుల్ శోధన సూచిక (సెర్చ్ ఇండెక్స్) 100 మిలియన్ గిగాబైట్లు అంతకన్నా ఎక్కువ సైజును కలిగి ఉంటుంది. ఈ డేటాను నింపటానికి లక్ష వన్-టెరాబైట్ పర్సనల్ డ్రైవ్‌లు అవసరముతాయి.

 

గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్

 

గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీ‌పేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.

 

వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది

2010 నుంచి గూగుల్ సగుటన వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది.

 

ట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్’

 

గూగుల్ హోమ్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్’.

 

గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్

 

గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు. అప్పటి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 40.

 

జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో

 

గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గర్వకారణం.

 

2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత

 

2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ

 

గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ’ అనే పేరుతో బటన్ ఉంటుంది. వినియోగదారు ఈ బటన్‌ను క్లిక్ చేసినపుడు, వినియోగదారకు శోధన ఇంజిన్ ఫలితాల పేజీని దాటవేసి, నేరుగా మొదటి శోధన ఫలితాలు ప్రదర్శించబడతాయి. ఈ ఫీచర్ కారణంగా గూగుల్ ఏడాదికి $100 మిలియన్లను నష్టపోతున్నట్లు అంచనా.

 

 

గొర్రెలను అద్దెకు తీసుకుంది

గొర్రెలను అద్దెకు తీసుకుంది

గూగుల్ గురించి 30 ఆసక్తికర నిజాలు

గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది. ఈ గొర్రెలు కాలిఫోర్నియాలోని తమ ప్రధాన కార్యాలయంలో గడ్డిని మేయటంతో పాటు భూమిని సారవంతం చేసేవి.

గూగుల్ మొదటి అధికారిక ట్వీట్

 

గూగుల్ మొదటి అధికారిక ట్వీట్ ‘‘ఐ యామ్ ఫీలింగ్ లక్కీ” (“I’m feeling lucky”)

గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌ల వాటా 16శాతం

 

కంపెనీలో గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌ల వాటా 16శాతం

Comments

comments