health

చెరుకు రసం కామెర్ల నుంచి క్యాన్సర్ వరకూ తరిమికొట్టగలదు లైంగిక శక్తిని పెంచగలదు..సమ్మర్ లో కుమ్మేయండి

మన దగ్గర చెరుకు రసం ఎప్పుడైనా, ఎక్కడైనా లభిస్తుంది. ప్రధానంగా ఎండాకాలంలో చాలా మంది చిరు వ్యాపారులు దీన్ని విక్ర‌యిస్తారు. ఎండ‌లో బ‌య‌ట తిరిగే వారు ఎక్కువ‌గా చెరుకు ర‌సాన్ని తాగేందుకు ఆస‌క్తి చూపుతారు. అయితే చెరుకు ర‌సం కేవ‌లం మ‌న దాహాన్ని తీర్చ‌డ‌మే కాదు, ఎన్నో పోష‌కాల‌ను అది మ‌న‌కు అందిస్తుంది. దాంట్లో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

యాంటీ ఆక్సిడెంట్లు

చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ దీంట్లో అధికంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడేస్తాయి.

లివర్‌ను పటిష్టం చేస్తుంది

ఎండ‌లో తిరిగే వారు చెరుకు ర‌సం తాగితే శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యం అవుతాయి. దీంతో ఎండ దెబ్బ తాక‌కుండా ఉంటుంది. సాధారణ జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో చెరుకు రసం బాగా పనిచేస్తుంది. చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది. లివర్‌ను పటిష్టం చేస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి చెరుకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

అలసట తొలగిపోతుంది

చెరకు రసం అనేక అనారోగ్యాల బారి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. తక్షణ శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం వంటివి ఇందులో అధికంగా ఉన్నాయి. అలసట తొలగిపోతుంది. చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలగిపోతుంది. సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు దీంట్లో ఉన్నాయి. కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మినరల్స్ ఉంటాయి

మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. నోటి దుర్వాసనను, దంత క్షయాన్ని తగ్గించే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ చెరుకు రసంలో ఉన్నాయి.

తక్షణమే శక్తి

డీహైడ్రేషన్, తక్కువ బ్లడ్ షుగర్ లెవల్స్ ఉండేవారు, నీరసంగా, బద్దకంగా ఉండేవారు రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగాలి. దీంతో తక్షణమే శక్తి లభిస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఏ పని చేసినా అంత త్వరగా అలసిపోరు. క్రీడాకారులు, వ్యాయామం చేసే వారికి మంచి ఎనర్జీ డ్రింక్‌గా చెరుకు రసం పనికొస్తుంది. కూల్ డ్రింక్స్ తాగే బదులు సహజ సిద్ధమైన చెరుకు రసం తాగితే మంచి ఫలితం కలుగుతుంది.

కిడ్నీ స్టోన్లు పోతాయి

రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే మూత్రాశయ సమస్యలే కాదు, కిడ్నీ స్టోన్లు కూడా ఉండవు. కరిగిపోతాయి. కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. పచ్చ కామెర్లు వచ్చిన వారు చెరుకు రసం తాగితే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే లివర్ పనితీరును మెరుగు పరిచే గుణాలు చెరుకు రసంలో ఉంటాయి. కనుక లివర్ ఆరోగ్యం బాగుపడుతుంది. ఫలితంగా కామెర్లు తగ్గుతాయి. శరీరం కోల్పోయిన ప్రోటీన్‌ను తిరిగి పొందేందుకు చెరుకు రసం పనికొస్తుంది.

ఎముకలను దృఢంగా మారుస్తుంది

చెరుకు రసంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. దంత సమస్యలను పోగొడుతుంది. రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అయితే చెరుకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి ముఖం, మెడకు రాసి 20 నిమిషాలు ఆగాక కడిగేసినా ముఖం కాంతివంతంగా ఉంటుంది. మచ్చలు పోతాయి.

గర్భిణులకు మంచిది

గర్భిణులకు చెరకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గర్భస్థ శిశువుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. జుట్టు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వృద్ధాప్య ఛాయల్నీ అడ్డుకుంటాయి.

మోతాదు మించి తాగరాదు

అరికాళ్లు మంటగా వున్నా, మూత్రం మంటగా వున్నా గ్లాసు చెరకురసంతో ఎంతో ఉపశమనం. శరీరానికి శక్తినిచ్చే గుణం కలది. చాలా లావుగా వున్నవాళ్ళు చెరకు రసం మోతాదు మించి తాగరాదు. కండరాలకు, మేధస్సుకు అద్భుత శక్తినిచ్చే దివ్య ఔషధం. చెరకు రసం తాగేవారు నిమ్మరసం, అల్లంముక్క కలుపుకుని సాయంత్రం వేళలో తీసుకోవడం ప్రయోజనకరం.

Comments

comments