movies

కీర్తి రెడ్డితో విడాకులపై స్పందించిన సుమంత్..!

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది సుమంత్, కీర్తి రెడ్డి డైవర్స్ కేసు. అయితే, ఇన్నాళ్లుగా ఎప్పుడూ సుమంత్ గానీ, కీర్తి గానీ, ఈ డైవర్స్ గురించి మాట్లాడలేదు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని, కనీసం రెండేళ్ల పాటు కూడా కాపురం చేయలేకపోయారు. సుమంత్ నుంచి విడాకులు తీసుకుని, మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది కీర్తి.

ఇక ఆ తర్వాత సుమంత్ మరో అమ్మాయి వైపు చూడలేదు. పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంపై ఎప్పుడూ నోరు విప్పని సుమంత్, ఇన్నాళ్లకు ఒక ఇంటర్వ్యూలో తాము ఇద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో స్పష్టం చేశాడు.

“పెళ్లి తర్వాత కేవలం ఏడాదిన్నర మాత్రమే మేము కలిసుండగలిగాం. మా జీవితాలు వేరు, మా వ్యక్తిత్వాలు వేరు అని మాకు అర్ధం అవడానికి అంత సమయం పట్టింది. ఎంతో కాలం కలిసి ఉండలేమని అర్ధం చేసుకుని ఉమ్మడి అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయాం. తను మరో పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలతో హ్యపీగా ఉంది. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం.

అయితే, ఆమె ఇప్పటికీ నా స్నేహితురాలే. అప్పుడప్పుడూ ఫోన్లో కూడా మాట్లాడుతుంటా. చివరిసారిగా తాతగారు చనిపోయినప్పుడు తనను చూశాను” అంటూ సుమంత్ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ తో ఎంటరైనా, ఇక ఆ తర్వాత సుమంత్ ను పెళ్లి చేసుకుని కీర్తి రెడ్డి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

Comments

comments

Recent Posts