news

అరుదైన ఘనత సాధించిన సుప్రియ !

హైదరాబాద్ ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యింది. హైదరాబాద్ మెట్రో‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. మెట్రో రైల్‌లో ప్రధాని మోదీ మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు…ఆ తర్వాత కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. మోదీ ప్రయాణించిన తొలి మెట్రో రైల్‌ను నిజామాబాద్‌కు చెందిన లోకో పైలట్ సుప్రియ నడిపారు. తొలి మెట్రో రైల్‌ను నడపడం పట్ల చాల ఆనందం కలిగింది అని చేపింది.

హైదరాబాద్‌ మెట్రోలో లోకో పైలెట్ల్లు మొత్తం 100 మంది ఉండగా, వారిలో 35 మంది మహిళలు ఉన్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. వాళ్లు ఇంజినీరింగ్‌, డిప్లొమా చదివిన వారు కావడం విశేషం. మహిళా లోకోపైలెట్‌లకు శిక్షణలో భాగంగా 18 నెలలుగా ట్రైయల్‌ రన్‌ చేస్తున్నారు. అందులో వరంగల్‌కి చెందిన కె.సింధూజ 8,000 కిలోమీటర్ల దూరం మెట్రోరైలును నడిపి రికార్డును సృష్టించారు. మహబూబ్‌నగర్‌కి చెందిన వెన్నెల 3000 కిలోమీటర్ల దూరం రైలును నడిపారు. ప్రధాని మోదీని మెట్రో రైల్లో తీసుకెళ్లిన ఎస్‌. సుప్రియ 2,500 కిలోమీటర్లు డ్రైవ్‌ చేశారు.

విమెన్ ఎంపవర్మెంట్ ఈరోజుల్లో చాల అవగాహనా వచ్చింది దీనికి ఉదాహరణ హైదరాబాద్‌ మెట్రోలో లోకో పైలెట్ల్లు మొత్తం 100 మంది ఉండగా, వారిలో 35 మంది మహిళలు వున్నారు.

ఎస్‌. సుప్రియ ది నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ సిఎస్‌ఐ కాంపౌండ్‌. మనకి తెలియని విషయాలు తన మాటలోనే … చిన్నప్పటి నా ప్రపంచం చదువూ, ఆటపాటలు. అంతేకాదు హాకీ, బ్యాడ్మింటన్‌, టేబుల్‌టెన్నిస్‌… సంగీతం ఇలా అన్నింట్లో ముందుండేదాన్ని. పైగా అమ్మావాళ్లు ఏ ఆట వస్తువు ఇచ్చినా.. వెంటనే దాన్ని విడదీసి, చూసి మళ్లీ బిగించేదాన్ని. మా నాన్న ప్రమోద్‌కుమార్‌ ప్రయివేటు విద్యాసంస్థలో పనిచేసేవారు. తల్లి ప్రభావతి ఏపీ డెయిరీలో పర్యవేక్షకురాలిగా పదవి విరమణ తీసుకుంది. వయసు పెరిగేకొద్దీ నాకొచ్చిన మరో ఆసక్తి బైక్‌ నడపడం.

ఓ రోజు రైలు నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఇంటర్‌ వరకూ మా వూళ్లొనే చదివిన నేను హైదరాబాద్‌లోని వీబీఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. సీబీఐటీలో ఎంటెక్‌ పూర్తిచేశా. రైలు నడపాలనే ఆసక్తితోనే ఎంటెక్‌లో కోర్‌ సబ్జెక్టుగా మెట్రోరైలు లోకో పైలట్‌ అంశాన్ని ఎంచుకున్నా. ఇందుకోసం ముంబయి, దిల్లీ వంటి నగరాల్లోని మెట్రోరైలు ప్రాజెక్టుపై ప్రత్యేకంగా నివేదిక కూడా రూపొందించా. అప్పుడే హైదరాబాద్‌లోని మెట్రోరైలును నడపగలిగితే ఎలా ఉంటుందని అనిపించింది కానీ నాకా అవకాశం రావాలిగా. కానీ అనుకోకుండా మొదటిసారే నడిపే అవకాశమే వచ్చింది.

ప్రత్యేక శిక్షణ తీసుకున్నా… హైదరాబాద్‌లో మెట్రోరైలు మొదలుకావడం.. ఇందుకోసం లోకోపైలట్‌లు కావాలంటూ 2015లో ప్రకటన రావడంతో వెంటనే దరఖాస్తు చేసుకున్నా. ముందస్తు ఎంపికా, పరీక్షల్లో విజయవంతం కావడంతో ఏడాదిన్నర పాటు ప్రత్యేక శిక్షణను ఎల్‌ అండ్‌ టీ సంస్థ అందించింది. ఈ నవంబరు 23 నాటికి అది పూర్తయ్యింది. మెట్రోరైలు నడపడం, పట్టాల పనితీరూ, ముందస్తు జాగ్రత్తలూ, సమస్యలు వచ్చినప్పుడు స్పందించి పరిష్కరించడం వంటి అంశాలపైనా అవగాహన కల్పించారు. ఇక, శిక్షణలో భాగంగా మొదటిసారి రైలు నడపబోతున్నాం అనేసరికి చాలా ఉత్సాహంగా అనిపించింది. పైగా ఎత్తులో కదా.. నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచా.

శిక్షణా కాలం పూర్తయ్యాక మాకు పరీక్షలు పెడితే.. నేను ఫస్ట్‌ వచ్చా. ఆ తర్వాతే మెట్రోరైలు కేంద్ర అధికారులు తొలి లోకోపైలట్‌గా ఎంపిక చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించి, ప్రయాణించిన రైలును నేను నడపడం.. చాలా ఆనందంగా అనిపించింది. ఆ క్షణాలను నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. అలా మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకూ ప్రయాణించిన మెట్రోరైలుకు తొలి లోకోపైలట్‌గా గుర్తింపు తెచ్చుకున్నా. అక్కడి నుంచి మళ్లీ కూకట్‌పల్లీ వరకూ మరో అబ్బాయి నడిపాడు. రేపటి నుంచి ప్రయాణికుల్ని ఎక్కించుకుని నడపబోతున్నా. ఇకపై మాకు రోజూ పనివేళలు ఎనిమిది గంటలు. దాన్ని బట్టి ఎన్ని విడతల్లో నడపాల్సి వస్తుందనేది తెలీదు. ఇలా ఉద్యోగం వచ్చిందనగానే అమ్మావాళ్లు చాలా సంతోషించారు. ప్రోత్సహించారు కూడా. నేను ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఒకవిధంగా మా ఇంట్లోవాళ్లే కారణం అని గర్వంగా చెప్పుకుంటా.

Comments

comments