movies

సైరా నర్సింహారెడ్డి లో అల్లు అర్జున్..?

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమాగా భారీ బడ్జెట్ తో
కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సైరా సినిమా లో ఒక ప్రత్యేక పాత్ర లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నట్టుగా సమాచారం. రుద్రమ దేవి సినిమాలో లో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. ఆ క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటనకు ఎంతో పేరు తెచ్చింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,నయనతార,తమన్నా,విజయ్ సేతుపతి,సుదీప్,రవికిషన్,జగపతి బాబు వంటి నటులతో తెరకెక్కబోతుంది సైరా. ఈ మూవీ లో అల్లు అర్జున్ కూడా నటిస్తే సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుంది. అంతే కాదు బన్నీ కి తమిళ్,మలయాళంలో మంచి క్రేజ్ ఉండడంతో కలెక్షన్లు బాగా వస్తాయి. ఒక వేళ ఈ వార్త నిజమయితే చిరంజీవి,అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకులకు,మెగా అభిమానులకు పండుగే.

Comments

comments