reviews

గీతా గోవిందం టీజ‌ర్‌: కంప్లీట్లీ డీసెంట్ నౌ…!

‘అర్జున్ రెడ్డి’ త‌ర‌వాత‌… విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ అయిపోయాడు. అత‌న్నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే… ఫోక‌స్ ప‌డాల్సిందే. అలాంటి ఫోక‌స్ తెచ్చుకుంది గీత గోవిందం. గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ అండ‌దండ‌లుండ‌డం, ఇటీవ‌ల విడుద‌ల చేసిన తొలి పాట‌కు మంచి క్రేజ్‌రావ‌డంతో…

ఈ సినిమాపై అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. ఇప్పుడు టీజ‌ర్ విడుద‌లైంది. ‘ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం నీదీ నాదీ’ అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ క‌ల‌లు క‌న‌డం, హీరోయిన్ చెంప‌దెబ్బ‌తో ఈ లోకంలోకి రావ‌డం… తిక్క తిక్క వేషాలేశావంటే, యాసిడ్ పోస్తా… అని హీరోయినే వార్నింగ్ ఇవ్వ‌డం.. మొత్తంగా చూస్తే..

 

ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చూడ‌బోతున్నామ‌న్న ఫీలింగ్ తీసుకొచ్చింది గీత గోవిందం. అర్జున్ రెడ్డితో పోలిస్తే… గీత గోవిందంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మేకొవ‌ర్ పూర్తిగా మారిపోయింది. ‘ఐ యామ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ’ అన‌డ‌మే కాదు, నిజంగానే విజ‌య్ డీసెంట్‌గా మారిపోయాడు.

 

‘మేడ‌మ్‌.. మేడ‌మ్‌’ అంటూ హీరోయిన్ చుట్టూ తిర‌డం కూడా ఆక‌ట్టుకునేదే. మొత్తానికి ‘గీత గోవిందం’ చూడ‌ద‌గ్గ సినిమాలానే క‌నిపిస్తోంది. వెండి తెర‌పై ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఇంకెన్ని మ్యాజిక్కులు చూపిస్తాడో చూడాలి.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment