health

మీ గర్ల్ ఫ్రెండ్ కి మీరు బోర్ కొట్టేసార !!

మీ గర్ల్ ఫ్రెండ్ ఈ మధ్య ఏదోలా ఉంటుందా…మీతో మాట్లాడటం లేదా మీపైన ఇంట్రెస్ట్ చూపించడం లేదా మీపైన ప్రేమ తగ్గిందా…అయినా మీమీద ఇంట్రెస్ట్ తగ్గిందని ఎలా తెలుసుకోవడం..అని ఆలోచిస్తున్నారా…మీకోసమే మానసిక నిపుణులు కొంతమంది పై సర్వే చేసి అసలు అమ్మాయిలకు మగవారిపై ఇంట్రెస్ట్ ఏ దశలో కలుగుతుంది…ఈ మేరకు ఇంట్రెస్ట్ తగ్గిందని తెలిపే కొన్ని లక్షణాలను సంకేతాలను తెలిపారు. ఆ విషయాలు ఇపుడు మీకోసం…

Couple fighting

ఇంతకుముందు పబ్లిక్ ప్లేస్ లలో మీతో ఆమె చాలా క్లోజ్ గా ఉండటం. కౌగిలించుకోవడం, ముట్టుకోవడం వంటి వాటిని చేసేది. కానీ ఈ మధ్య ఆమె పబ్లిక్ ప్లేస్ లో కనీసం మీ చేతిని కూడా పట్టుకోవడం లేదంటే.. ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం. గతంలో మీరు ఏం చెప్పినా.. మీతో అంగీకరించేది.

కానీ ఇటీవల మీరు చెప్పే విషయాలను వ్యతిరేకిస్తోంది.ఏ చిన్న విషయాన్నైనా.. తప్పు పడుతోంది అంటే.. ఆమె మీపై ఆసక్తిని కోల్పోతోందని సంకేతం. గతంలో ఆమెకు మీరే ప్రపంచం. కానీ ఇటీవల తన సహోద్యోగి అందం గురించి ఎక్కువగా మాట్లాడటం, ఆ వ్యక్తి ఎంత తెలివైన వ్యక్తో అని మీముందు మెచ్చుకోవడం, లాంటి మాటలన్నీ ఆమె మీపై ఆసక్తి కోల్పోయిందని సూచిస్తుంది.

ఫ్యూచర్ ప్లాన్స్ ఇంతకుముందు తన ఫ్యూచర్ ప్లాన్స్, ట్రిప్స్ లో మిమ్మల్ని చేర్చి మాట్లాడేది. కానీ.. ఆమె తనకు తానే నిర్ణయాలు తీసుకుని ఒంటరిగా ప్రయాణించడానికే ఆసక్తి చూపుతోందంటే.. ఆమె మీపై ఆసక్తి కోల్పోయిందని సంకేతం.ఆమె ఎప్పుడూ మీతోనే ఉండేది.

కానీ ఈ మధ్య ఎక్కువ సమయం తన సహాద్యోగులతోనే గడుపుతోంది అంటే ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం.గతంలో ఆమె మిమ్మల్ని హీరోగా భావించేది. చాలా క్యూట్ గా ఉన్నావంటూ.. కాంప్లిమెంట్ ఇచ్చేది.కానీ ఇటీవల మిమ్మల్ని అవమానించడం, తక్కువగా మాట్లాడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే..

ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే ఆ బంధానికి ఇక తెర పడినట్టే…మీరూ ఒకసారి ఎందుకైనా చెక్ చేసుకోండి అని సూచిస్తున్నారు అమెరికా మానసిక నిపుణులు…

Comments

comments