health

మీ కళ్ళ కింద నల్లని మచ్చలు చిటికలో మాయం

జీవిత కాలంలో ఏ సమయంలోనైన లేదా ఎపుడైనా, ప్రతి ఒక్కరు కళ్ళ కింద నల్లటి వలయాను పొందుతారు అవునా! చర్మం కింద, సిరలలో రక్త స్థాయిలు తగ్గిపోవటం వలన నిద్రాభంగం కలిగి, అనారోగ్యం, ఒత్తిడి ఏర్పడి, కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుటకు కారణాలుగా చెప్పవచ్చు.

ఇలా కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను తొలగించుటకు చాలా రకాల పద్దతులు అందుబాటులో ఉన్నాయి. సౌందర్య ఉత్పత్తులు లేదా కాస్మెటిక్స్, ఈ నల్లటి వలయాలను తాత్కాలికంగా కనపడకుండా చేస్తాయి మరియు చర్మ కణాలు కూడా అనారోగ్యానికి గురవుతుంటాయి. ఒకవేళ వీటిని వాడాలి అనుకుంటే మాత్రం, వీటికి తగిన విధంగా కంటి చుట్టూ కూడా మేకప్ వేయాలి.
సహజంగా కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.

సరైన సమయం పాటూ విశ్రాంతి

కంటి కింద నల్లటి వలయాలు లేదా మచ్చలు ఏర్పడటానికి ముఖ్య కారణం- సరైన సమయం పాటు నిద్ర లేకపోవటం. కావున ప్రతిరోజు కనీసం 7 గంటల పాటూ విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తక్కువ సమయం పాటూ తీసుకోవటం వలన కంటి కింద చర్మం సన్నగామారి, రక్త ప్రసరణ తగ్గి, కళ్ళ కింద నల్లటి వలయాలు లేదా మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు కలుగ కుండా ఉండాలంటే తగిన సమయం పాటూ విశ్రాంతి తప్పని సరి. సరైన సమయం పాటూ నిద్ర లేకపోవటం వలన, చాలా రకాల అనారోగ్యాలకు గురవుతుంటారు.

ఆరోగ్యకర ఆహరం

కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుటకు విటమిన్ లోపం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఆరోగ్యకర ఆహరం, అన్ని రకాల పోషకాలు ఉన్నట్టి ఆహార ప్రణాళిక అనగా పండ్లు మరియు కూరగాయలు ఉన్నట్టి ఆహార ప్రణాలికలను రోజు అనుసరించటం వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కళ్ళ కింద ఏర్పడే దోషాల ఏర్పాటు కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా, మీరు తీసుకునే ఆహరంలో అధిక మొత్తంలో విటమిన్ ‘C’ మరియు విటమిన్ ‘K’ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త వహించండి. అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవటం వలన కూడా కళ్ళ కింద వాపులు ఏర్పడవచ్చు. కావున మీరు తినే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి.

సహజ ఔషదాలు

బాదం నూనె మరియు తేనె

రెండు చెంచాల తేనె మరియు బాదం నూనెను కలపండి. రోజు రాత్రి పడుకోటానికి ముందుగా, రెండు కళ్ళ కింద ఈ మిశ్రమాన్ని రాయండి. ఉదయాన లేవగానే నీటితో కడిగివేయండి. వీటితో పాటుగా, రోజు 10 బాదం గింజలను తినటం వలన మంచి మార్పులను గమనిస్తారు.

 

టమాట మరియు నిమ్మ

ఒక చెంచా తాజా నిమ్మకాయ రసం మరియు టమాట రసాన్ని కలపండి. ఈ మిశ్రమానికి ఒక చెంచా శనగపిండిని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, కళ్ళ కింద పూసి కనీసం 10 నుండి 15 నిమిషాల వరకు వేచి ఉండండి. కొన్ని రోజులలోనే గమనించతగ్గా మార్పులను గమనిస్తారు.

కుదించటం

కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించుటకు అందుబాటులో ఉన్న ముఖ్య పద్దతి, దోసకాయ లేదా బంగాళదుంప ముక్కలను కళ్ళపై ఉంచటం. ఇవి కుడిచే గుణాలను కలిగి ఉండటం వలన మంచి ఫలితాలను పొందుతారు. వీటిని వాడటం వలన కళ్ళ కింద ఏర్పడిన వాపులు తగ్గటమే కాకుండా, కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఈ పద్దతి చాలా సులభం మరియు శక్తివంతంగా పని చేస్తుంది. తాజాగా కత్తిరించిన బంగాళదుంప లేదా దోసకాయ ముక్కలను కత్తిరించి రోజు కనీసం 10 నిమిషాల పాటూ కళ్ళపై ఉంచటం వలన కళ్ళ కింద లేదా చుట్టూ ఉండే వలయాలు తగ్గిపోతాయి.

టీ

మీకు టీ తాగే అలవాటు ఉందా! అయితే దీని వలన రెండు మార్గాలుగా ప్రయోజనాలను పొందుతున్నారు. మొదటిది- టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్’లు కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలను శక్తివంతంగా తగ్గి వేస్తాయి. రెండవది- వాడిన తరువాత చల్లబరచిన టీ బ్యాగ్’లు కుదించే గుణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, టీ బ్యాగ్’లో టానిన్’లు ఉన్నందు వలన కళ్ళకింద ఏర్పడే మచ్చలను మరియు వాపులను తగ్గించి వేస్తాయి.
కంటి కింద లేదా చుట్టూ ఏర్పడే మచ్చలను లేదా వలయాలను మేకప్’ల ద్వారా తాత్కాలికంగా, వేగంగా కనబడకుండా చేయవచ్చు. కానీ, ఇది దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం కాదు. తగిన జాగ్రత్తలను పాటించటం వలన వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ సహజ పద్దతులను పాటించిన కూడా సమస్య తగ్గని ఎడల, వైద్యుడిని కలవండి. కొన్ని సార్లు వైద్యపరమైన లేదా ఆరోగ్య పరిస్థుతుల వలన కూడా ఇలా జరగవచ్చు.

Comments

comments