reviews

తొలిప్రేమలో తేజు– ఫస్ట్ ఫీల్ రివ్యూ

నాలుగు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అందుకున్న హీరో ఈ మధ్య కాలంలో సాయి ధరం తేజ్ ఒక్కడే. ఇంటెలిజెంట్ దెబ్బకు తన సినిమా అంటేనే డిస్ట్రిబ్యూటర్లతో సహా ప్రేక్షకులు కూడా భయపడేలా చేసుకున్న తేజు చేస్తున్న కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు. అనుపమ పరమేశ్వరన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కెఎస్ రామారావు నిర్మించారు.

టీజర్ తరహాలో ఉన్న ఈ ఫస్ట్ ఫీల్ లో డైలాగ్స్ లేకుండా కేవలం సీన్ తోనే లాగించారు. టీ తాగుతూ బస్ స్టాప్ లో ఉన్న తేజుకి ఎదురుగా వయోలిన్ వాయిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తుంది. అంతే. మెల్లగా తన జర్కిన్ లో నుంచి అనుపమ బయటికి వచ్చి అతని ఒళ్లోనే ఉంటూ తేజు తాగిన టీ సిప్ చేస్తుంది. తర్వాత అదంతా తన ఊహే అని తెలుసుకున్న తేజు అవాక్కవ్వడంతో టీజర్ ముగుస్తుంది.

మరీ చెప్పుకోదగ్గ విశేషం ఏమి లేకపోయినా తన వయసుకు తగ్గ పాత్ర తేజు ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. రిస్క్ లేకుండా ఒక రెగ్యులర్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ తరహాలోనే ఇది సాగినట్టు కనిపిస్తోంది. కాకపోతే ఇంటెలిజెంట్ సమయానికే కొద్దిగా బొద్దుగా మారిన తేజు ఇందులో కూడా అదే ఫిజిక్ తో కనిపించడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుపమ ఎప్పటి లాగే క్యుట్ గా ఉంది. గోపి సుందర్ మ్యూజిక్ మాత్రం ఆహ్లాదంగా ఉంది.

ఇది హిట్ కావడం తేజుకి చాలా అవసరం. మిగిలిన మెగా హీరోలు ఫుల్ ఫాంలో ఉన్న టైంలో తను వెనుకబడిపోయాడు. తొలిప్రేమ, డార్లింగ్ లాంటి హిట్ సినిమాలతో తెలుగు వాళ్ళకు కూడా సుపరిచితుడు అయిన కరుణాకరన్ దీనికి దర్శకుడు కావడం మరో ఆకర్షణ. మరి తేజు కోరుకున్న సక్సెస్ ఇదైనా ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Comments

comments