movies

టాప్ 10 మూవీస్ అఫ్ టాలీవుడ్ usa ప్రీమియర్స్ 2017

బాహుబలి 2

 యు.యస్.ఏ ప్రీమియర్స్+ఫస్ట్ డే: $ 4.6 Million (33 కోట్లు). రాజమౌళి వెండితెరపై సృష్టించిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 9,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా 6,500 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ 96 శాతం ఆక్యుపెన్సీ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది.

ఖైదీ నంబర్ 150

ఖైదీ నంబర్ 150 చిత్రం తొలిరోజున తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులను సృష్టించింది అని అన్నారు అల్లు అరవింద్. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.  అమెరికాలో 1.22 మిలియన్స్ కలెక్షన్స్ రాబట్టింది.

స్పైడర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది… అమెరికాలో 1$ మిలియన్స్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హిస్టారికల్ ఓపెనింగ్స్ తో తొలి రోజు బాహుబలి తర్వాత ఈ ఇయర్ సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి సంచలనం సృష్టించిన మహేష్ కి అద్బుతమైన వెల్ కం లభించింది అని చెప్పొచ్చు.  

కాటమరాయుడు

డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఓవర్సీస్లోనే 250 థియేటర్లలో ఈ సినిమా రిలీజైందంటే పవన్ మేనియా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఇప్పటి వరకూ తెలుగు సినిమా చరిత్రలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అతి పెద్ద ఓవర్సీస్ రిలీజ్ కావడం విశేషం.అమెరికాలో $ 684K  కలెక్షన్స్ రాబట్టింది.

ఈ సినిమా పవన్ కెరీర్లో హైయెస్ట్ డే-1 వసూళ్లు సాధించింది కానీ.. ఆల్ టైం రికార్డును కొట్టలేకపోయింది. కొన్ని ఏరియాల వరకు ‘ఖైదీ నెంబర్ 150’ పేరిట ఉన్న ఆల్ టైం రికార్డును బద్దలు కొట్టిన ‘కాటమరాయుడు’ ఓవరాల్ కలెక్షన్లలో మాత్రం ‘ఖైద నెంబర్ 150’.. ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

జై లవ కుశ

జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి ‘జై లవ కుశ’ నిరూపించింది.ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చాలా బాగుందని, అంతకు మించి ఎన్టీఆర్ యాక్షన్ అదిరిపోయింది. దీనికి తగ్గట్టుగానే బాక్సాఫీసు వద్ద ‘జై లవ కుశ’ కలెక్షన్ల వర్షం కురిపించింది.  యూఎస్ బాక్సాఫీసు వద్ద  560,699 డాలర్లు (సుమారు రూ.3.64 కోట్లు) రాబట్టింది.

దువ్వాడ జగన్నాధం

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వివాదాల నడుమ రిలీజ్ అయి హిట్ అందుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అమెరికాలో $ 550 K  కలెక్షన్స్ రాబట్టింది.భారీ అంచనాల మధ్య విడుదల అయిన అల్లు అర్జున్ సినిమా డీజే, క్రేజ్ కు తగ్గట్టైన కలెక్షన్లను అందుకుంది. 

 

గౌతమీపుత్ర శాతకర్ణి

బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు తొలి రోజు బాలయ్య కెరీర్లోనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది.అమెరికాలో $ 376 K కలెక్షన్స్ రాబట్టింది.

 

ఫిదా

వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా మూవీ ప్రేక్షకులను ఫిదా చేయడంతో కలెక్షన్ల వర్షం కురిపించింది . ఓవర్సీస్ ఆడియన్స్‌లో మాస్ మసాలా సినిమాలంటే క్లాస్ లవ్ స్టోరీలు, థ్రిల్లర్ సినిమాలు బాగా ఆడతాయి. అమెరికాలో $ 367 K కలెక్షన్స్ రాబట్టింది.

MCA

వరుస విజయాల తో దూసుకు పోతున్న నాని నటించిన లేటెస్ట్ మూవీ MCA బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము లేపే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది…. అమెరికాలో $ 303 K  కలెక్షన్స్ రాబట్టింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్ టాప్ హీరోల లో కొందరి ఓపెనింగ్స్ ని కూడా సవాల్ చేసే విధంగా కలెక్షన్స్ ని రాబట్టడం ఇక్కడ విశేషం అనే చెప్పాలి.

 

Hello

అక్కినేని అఖిల్ మొత్తానికి రెండో సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నట్టే. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘హలో’ అఖిల్ కు ఉత్సాహాన్ని మరియు కలెక్షన్ల వర్షం కురిపించింది.అమెరికాలో $ 213 K  కలెక్షన్స్ రాబట్టింది.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment