movies

యన్టీఆర్ తో పోటీ పడబోతున్న విజయ్…

విజయ్ దేవరకొండ క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది తెలుగు చిత్ర పరిశ్రమలో. విజయ్ సినిమాలు ఊహించినదానికంటే ఎన్నోరెట్లు కలక్షన్స్ రాబడుతుండడంతో నిర్మాతలు కూడా విజయ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. తాజాగా తమిళంలోనూ తన క్రేజ్ పెంచుకునే దిశగా నోటా అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నారు. విజయ్ తన స్టామినా నిరూపించుకోవాలని యంగ్ టైగర్ యన్టీఆర్ కి సవాల్ విసరబోతున్నారు. ప్రస్తుతం యన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో అరవింద సమేత సినిమాని చేస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11 న రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఆ డేట్ లో మార్పు ఉండకూడదని అందరూ బాగా కష్టపడుతున్నారు. ఆ దసరాకే నోటా రిలీజ్ అవుతోంది. దీంతో యన్టీఆర్, విజయ్ మధ్య పోటి వాతావరణం నెలకొంది.

ఈ మూవీ ఆడియో వేడుకని ఈ నెల 20 న నిర్వహించనున్నారు ఐతే ఈసారి తారక్ కి తోడుగా బాబాయ్ బాలయ్య జత కలిశారు. అరవింద మూవీ కి బాలకృష్ణ, యన్టీఆర్ తో కలిసి ఆడియో ఫంక్షన్ కార్యక్రమానికి వస్తున్నారు. బాబాయ్ , అబ్బాయి కలిసి విజయ్ దేవరకొండ కి గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. తమ క్రేజ్ తో విజయ్ కి జోరుకి బ్రేక్ ఇవ్వనున్నారు. త్రివిక్రమ్ తొలిసారి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. అసలే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాకుండా బాలకృష్ణ, ఎన్టీఆర్ తో కలవడంతో నందమూరి అభిమానులందరూ ఒక్కటవ్వడంతో అభిమానులు థియేటర్ల ముందు క్యూ కట్టడం పక్క. నందమూరి అభిమానుల ప్రవాహాన్ని విజయ్ ఎంతమేరకు తట్టుకుంటాడో చూడాలి.

Comments

comments