movies

నిజంగా అది చూపించే దమ్ముందా

నిన్న ఫిలిం నగర్ మొత్తం ఉదయ్ కిరణ్ బయో పిక్ గురించిన టాకే నడుస్తోంది. ఆన్ లైన్ మీడియాలో సైతం ఇది హైలైట్ కావడం పలు చర్చలకు దారి తీసింది. దర్శకుడు తేజ దీన్ని టేకప్ చేయటం ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం దీనికి కాబోయే అల్లుడు అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసారనే వార్త టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. కారణం ఉదయ కిరణ్ లాంటి హీరో బయోపిక్ కి అలాంటి టైటిల్ సూట్ కాదు.

అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దానికి వ్యక్తిగత కారణాలతో పాటు వైవాహిక జీవితానికి సంబంధించినవి కూడా ఏవో ఉన్నాయని అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. మరి కాబోయే అల్లుడు అని పేరు పెట్టారు అంటే ఉద్దేశం ఏమై ఉంటుందా అనే ఆలోచనలు కలుగుతున్నాయి. ఉదయ్ కిరణ్ మెగాస్టార్ అల్లుడు కావడం తృటిలో తప్పిపోవడం తెలిసిన విషయమే. నిశ్చితార్థం దాకా వచ్చి ఆపై ఆగిపోవడం అప్పట్లో పెద్ద సెన్సేషన్.

ఈ వివాదంలోనే పవన్ కళ్యాణ్ అప్పట్లో మీడియాతో గొడవ పడి నానా రచ్చ చేస్తే విషయం కోర్ట్ దాకా వెళ్ళింది. ఇండస్ట్రీ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి దాన్ని సెటిల్ చేసారు కాని అప్పట్లో జరిగిన రభస చిన్నది కాదు. టీవీ మీడియా ఇంత అందుబాటులో లేకపోవడంతో ఇది ఓ మాదిరిగా కూల్ అయ్యింది. ఇప్పుడు ఈ బయోపిక్ తీస్తే ఉదయ్ కిరణ్ చిరు అల్లుడు కానివ్వకుండా చక్రం తిప్పింది ఎవరు అనే కోణం చూపిస్తారా అనేదే అసలు ప్రశ్న. ఒకవేళ అదే కనక జరిగితే పాత విషయాలు ఎందుకు తవ్వుతున్నారు అని మెగా ఫ్యామిలీతో అభిమానుల నుంచి కూడా నిరసన వ్యక్తం కావొచ్చు.

కాబోయే అల్లుడు టైటిల్ అందుకోసమే పెట్టారా అనే అనుమానం రాకమానదు. కాని ఉదయ్ కిరణ్ మెగాస్టార్ కు కాకపోయినా వేరే ఇంటికి అల్లుడు అయ్యాడు. ఆ లెక్కన ఆ పేరు సూట్ కాదు. చిన్న వయసులో చనిపోయిన యూత్ హీరో కాబట్టి గౌరవప్రదమైన టైటిల్ పెట్టాలి కాని ఇలా మాస్ సినిమాకు పెట్టినట్టు కాబోయే అల్లుడు ఏంటని అడుగుతున్న వారు లేకపోలేదు. తేజ స్వయంగా చెబితే తప్ప వీటికి చెక్ పడదు. తేజ సన్నిహితులు మాత్రం కాబోయే అల్లుడు టైటిల్ రిజిస్టర్ చేయటం నిజమే కాని అది తేజ బయోపిక్ కోసం కాకపోవచ్చు అంటున్నారు. ఈ సస్పెన్స్ కి తేజనే చెక్ పెడితే బెటర్

Comments

comments