movies

భర్త గురించి నిజాలు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను

ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త మరియు నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ఆ షో ప్రధాన ఉద్దేశం. ఆమెకు అప్పటికి యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది.యాంకర్ గా ఉదయభాను హై సక్సెస్. ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది. హార్లిక్స్ హృదయాంజలి ప్రోగ్రాం ద్వారా దాదాపు రెండు దశాబ్దాల క్రితం కెరీర్ ప్రారంభించిన ఆమె.. అసలు తెలుగు తెరకు యాంకర్ అంటే ఇలా ఉంటారని మొదటిగా తెలియచెప్పింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది. ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం భాగా ఫీలవుతోంది. అయితే ఆమె ఇటీవల తిరిగి ప్రత్యక్షమైంది. తిరిగి రెండో ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.

గలగలా సెలయేళ్లలో నీరు పారినట్లుగా మాట్లాడుతూ పోయే ఆమె యాంకరింగ్ కి ఇప్పటికీ అభిమానులున్నారు. బుల్లితెర మహారాణి.. మాటల మాంత్రికురాలు.. ఇలా ఒకటేంటి ఉదయభాను గురించి ఎంత‌ చెప్పినా తక్కువే. ఆమె ఏ ప్రోగ్రాం చేసినా, ఏ స్టేజ్‌ షో చేసినా అది సూప‌ర్ హిట్ అవ‌డం ఖాయం. బుల్లి తెరపై, వెండి తెరపై ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ఒక‌రంగా బుల్లితెర శ్రీదేవిగా పేరు తెచ్చుకన్నారు ఉద‌య‌భాను. దాదాపు 15 సంవత్సరాలు ఈమె బుల్లి తెరను ఏలింది. డ్యాన్స్ బేబి డ్యాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టిన ఉద‌య‌భాను, త‌న మార్క్ యాంక‌రింగ్ తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది.

అతి చిన్న వయసులో కెరీర్‌ ప్రారంభించి ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని స్వశక్తితో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలాకాలం బుల్లితెరకు దూరంగా ఉన్న ఆమె, ఏడాది కిందట కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక మూడేండ్ల విరామం తర్వాత మాటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న నీతోనే డ్యాన్స్‌షోతో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ తో కలిసి మళ్ళీ రీంట్రీ ఇచ్చారు. అయితే ఉద‌య‌భాను జీవితం పూల‌పాన్పు ఏమీ కాదు. ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొంది. తన కెరీర్ గురించి ఉదయభాను ఇలా చెప్పుకొచ్చింది… ‘మా అమ్మ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించారు. స్టేజి షోలు చేశాను. వాటి ద్వారా అవకాశాలు వచ్చాయి. ‘ఎర్ర సైన్యం’ నా మొదటి సినిమా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశా. ఎక్కువగా టీవీపై దృష్టి పెట్టాను.పల్లెటూరి నుంచి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చా. ప్రాంతాల వివక్ష, కుల వ్యవస్థ అన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు కావల్సినంత తీరిక దొరికింది కాబట్టి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయ్. ఇన్ని కష్టాలు పడ్డామా?’ అనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..

దు:ఖాన్ని దిగ‌మింగ‌కొని ఈ రోజు ఇంత పాపుల‌ర్ యాంక‌ర్ గా గుర్తింపు సాంపాదించుకుంది. అలాగే ఆమె క్యారెక్ట‌ర్ మంచింది కాద‌ని, ఎవ‌రెవ‌రితోనే లింకులు ఉన్నాయ‌ని వ‌దంతులు ప్రచారం చేశారు. అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొని త‌న‌కంటూ వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇలా ఉద‌య‌భాను జీవితంలో ప‌డ్డ క‌ష్టాలు చూస్తే క‌ళ్ల నుంచి నీళ్లు జలజలా రాలుతాయి. ఉదయభాను పుట్టింది కరీంనగర్‌ దగ్గర కొవ్వాడ‌. అమ్మ అరుణ ఆయుర్వేద డాక్టర్‌. నాన్న ఎస్‌.కె పటేల్‌. ఆయ‌న కూడా డాక్టరే. అయితే నాలుగేండ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. ఆయన చాలా దాన ధర్మాలు చేసేవారు. వందల ఎకరాలు దానం చేసిన గొప్ప దాత ఆయ‌న. కష్టపడేతత్వం వారి నుంచే తనకు వచ్చిందని, వారిచ్చిన ధైర్యంతోనే చిన్నతనం నుంచే మోయలేనన్ని భారాలు తనమీద ఉన్నా ముందుకు నడవగలిగానని ఉదయభాను అంటుంది.

నా పిల్లల్ని ఆడపులుల్లా పెంచుతాను. ఈ సమాజంలో అమ్మాయిలు అలా ఉంటేనే బతకగలరు. మమ్మల్ని కాపాడండీ అంటూ ఆర్తనాదాలు చేయకూడదు. దాడి చేసే వారిపై తిరగబడాలి. అందుకే ఆడపిల్లలకు కేవలం డ్యాన్స్‌, సంగీతం నేర్పిస్తే సరిపోదు. సెల్ఫ్‌డిఫెన్స్‌ కూడా నేర్పించాలి అని ఉద‌య‌భాను తెలిపింది.ఎక్కడి నుంచి ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు. ఎలా వేధిస్తాడో తెలియదు.వారి బారి నుంచి తమను తాము కాపాడుకునే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆడపిల్లలకు ఇవ్వాలి. ఏడిస్తే ఇంకా ఇంకా ఏడిపిస్తారు. అందుకే ఏడ్చి కన్నీళ్ళను వృధా చేసుకోకూడదు అంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను..ఇవన్నీ నా అనుభవాల నుంచి నేర్చుకున్నాను. మన వైపు వేలెత్తి చూపించే వాళ్ళ వేలుని విరగ్గొట్టాలి. ప్రేమ పంచడంతో పాటు తేడా వస్తే తాట తీయాలి. ఇవన్నీ నా పిల్లలకు నేర్పిస్తాను. దీని గురించే ఓ పుస్తకం కూడా రిలీజ్‌ చేయాలనుకుంటున్నానన్నారు. దానికోసం ఓ సాంగ్‌ కూడా రాశానన్న ఉద‌య‌భాను, తాను పెన్ను కదిలిస్తే విప్లవం వచ్చేస్తుందేమో అని ఆలోచిస్తున్నానని. కానీ పుస్తకం వివరాలు కూడా త్వరలోనే మీడియాకు చెబుతానని తెలిపారు.

ఇక త‌న భ‌ర్త గురించి ఉద‌య‌భాను కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. త‌న‌కు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని, త‌న ప్ర‌పంచం మొత్తం త‌న భ‌ర్త విజయ్ మాత్ర‌మేన‌ని తెలిపింది. అంద‌రూ త‌న క్యారెక్ట‌ర్ ను వేలెత్తి చూపించిన స‌మ‌యంలో, త‌న‌ను అక్కున చేర్చుకున్నారంటూ కంట‌త‌డి పెట్టింది ఉద‌య‌భాను. విజ‌య్, ఉద‌య‌భాను ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న విష‌యం తెలిసిందే. విజయ్ ది విజ‌య‌వాడ‌. ఒక ప్రోగ్రామ్ కోసం విజ‌య‌వాడ వెళ్లిన ఉద‌య‌భానుకు, విజ‌య్ ప‌రిచయం అయ్యాడు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. తన భర్త గురించి మాట్లాడుతూ… ‘ఐయామ్ లక్కీ ఇనఫ్. నాకు కావల్సినంత ప్రేమ విజ్జూ (భర్త విజయ్) నుంచి దక్కింది. ఒక్కటి కచ్చితంగా చెప్పగలను. ప్రపంచమంతా ఒక్కటై నావైపు వేలెత్తి చూపిస్తున్నా.. ఆ వేలుని విరిచి నా వెన్నంటే ఉండే భర్త దొరికాడు’ అంటూ ఆ ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు కార్చేసింది.

భార్యాభర్తలుగా మేం ఫైనాన్షియల్‌గా జీరోతో స్టార్ట్ అయ్యాం. సెటిల్ కావడానికి టైమ్ పట్టింది. రెండేళ్ల క్రితం పిల్లలు ప్లాన్ చేద్దామని విజ్జూ అన్నాడు. ప్లాన్ చేసేశామని ఉదయభాను తెలిపారు. కవలలు అని డాక్టర్ చెప్పగానే కన్నీళ్లు ఆగలేదనుకోండి. రాముడు సీత ఫోటోలు చూసినప్పుడల్లా ‘మీకు ఇద్దరు బిడ్డలు కదా.. నాకూ ఇద్దర్ని ఇవ్వండి’ అని కోరుకునేదాన్ని. నా చిన్నప్పుడు జంట అరటిపండ్లు, జంట టమోటాలు, జంట వంకాయలు తింటే కవల పిల్లలు పుడతారని అనేవాళ్లు. నేను కావాలని అవే తినేదాన్ని. నేను కవలల్ని కోరుకున్న ప్రతిసారీ ఆ దేవతలు ‘తథాస్తు’ అని ఆశీర్వదించారేమో అనిపిస్తోంది అని ఉదయభాను తెలిపారు.

Comments

comments