movies

సుమ ~ శృతిమించుతున్న రొమాన్స్.. మిడ్ నైట్ మసాలా టీవీ షో !

ఇరవై మూడేళ్ల కెరీర్‌… వేల కార్యక్రమాలు, ఎన్నో సీరియళ్లు … ఇలా యాంకర్‌ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే లిస్టు పెద్దదే అవుతుంది.. ఆమె టైమింగ్, సమయస్ఫూర్తి, గలగలా మాట్లాడే గొంతుక.. యాంకరింగ్ కు ప్లస్ పాయింట్లు.. తెలుగు నేటివ్ కాకపోయినా, ఇప్పటి తరం తెలుగమ్మాయిల కంటే అచ్చంగా, స్వచ్చంగా తెలుగు మాట్లాడడం సుమను యాంకర్లలో టాప్ ప్లేస్ కు తీసుకెళ్లింది.

అవార్డులు రివార్డ్ లకంటే కూడా కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ.ప్పుడు తెలుగు బుల్లి తెరపై యాంకర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం సుమ.. తనను స్పూర్తిగా తీసుకునే ఎందరో యాంకర్స్ అయ్యారు. ఇలా ఎంత మంది యాంకర్స్ వచ్చిపోతున్నప్పటికీ సుమ స్థానానికి ఎవరూ చేరుకోలేకపోయారు.

తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంట్లో ఆమె పేరు వినపడుతుంది.. ఇంటిల్లిపాదీ కూర్చుని తన యాంకరింగ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అమ్మలు, అమ్మమ్మలు, అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడాలేకుండా అందరూ ఆమెను ఇష్టపడుతుంటారు.…

సుమ తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. రికార్డెడ్ ప్రోగ్రాం అయినా, లైవ్ షో అయినా సందర్బానికి తగ్గట్టు మాటలు విసురుతూ అందర్నీ కట్టిపడేస్తుంది… ఆమె మాటల తాకిడికి చూసేవారెవరైనా ఫిదా అయిపోవాల్సిందే.. యాంకరింగ్ చేస్తున్నప్పుడు.. తప్పుగా మాట్లాడితే నిర్మోహమాటంగా ముఖంపైనే చెప్పేస్తుంది…

యాక్టర్ రాజీవ్ కనకాల భార్యగానే కాదు ఎందరో నటీ నటులకు సినిమా పాఠాలు చెప్పిన దేవదాస్ కనకాల కోడలు అయ్యుండి కూడా తనదైన ప్రతిభతోనే ఎదిగింది. ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ.. ప్రెగ్నెన్సీ టైంలో యాంకరింగ్ కి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు టీవీ అవకాశాలు రాకపోతే… విజయవాడ వెళ్లి అక్కడి లోకల్ ఛానెల్స్ లో తన కెరీర్ మళ్లీ కింది నుండి స్టార్ట్ చేసి నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చింది.. ఇదంతా చెప్పాల్సి వస్తోందంటే..

తెలుగు టీవీ ఛానల్ లో ‘సై సై సయ్యారే’ ప్రోగ్రాంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి పాటల గురించి వివరణ ప్రోగ్రామ్ వస్తోంది …. ఇందులో ఆయన పాటలు గురించి చెప్తూ ఓ జంట కూడా అదే పాటకు డాన్స్ చేస్తారు.. ఐతే ఇక్కడ అదిడాన్స్ లా లేదు మిడ్ నైట్ మసాలాలా ఉందని .. అభిమానులు యావత్తూ తిడుతూ కంమెంట్లు చేశారు..

ఇందులో సుమ యాంకరింగ్ చేసున్న సంగతి తెలిసిందే.. ‘ఇలాంటి ప్రోగ్రాముకి ఎందుకు యాంకిరంగ్ చేస్తున్నారో అర్దం కావట్లేదు.. ఆ ప్రోగ్రాంలో వచ్చే మీరు మాట్లాడే ఏ మాట కూడా వినడానికి బాగలేవు, అసలు ప్రోగ్రామే చూడ్డానికి బాగాలేదు’అంటూ సుమ పై ఓ వీరాభిమాని డైరెక్టుగా విరుచుకుపడిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

Comments

comments