news

ఉపాసన ప్రతిరోజూ ఓ పేపర్ ని రాత్రి పూట కాల్చి వేస్తుంది.. ఎందుకో తెలుసా?

ఉపాసన కొణిదెల.. రామ్ చరణ్ భార్యగానే కాదు.. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మెన్ గా.. బీ పాజిటివ్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా అందరికీ సుపరిచితురాలు.. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు డిఫరెంట్ పోస్టులు పెడుతూ.. మెగా అభిమానుల టచ్ లో ఉంటుంది. మెగా అభిమానులకు ఉపాసనా ఏదొక విషయం లో ఎలా ఉండాలి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. యాక్టివ్ గా ఉంటుంది.. కాగా తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా పేపర్ థెరపీ చెప్పి అందరినీ ఆశ్చర్యపరచింది. తనకు ప్రతి రోజూ వచ్చే నెగిటివ్ ఆలోచనలను ఓ పేపర్ పై రాసుకుంటానని చెప్పింది.. ఆ నెగిటివ్ విషయాల లిస్టును ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి చూసుకొని..

ఆ నెగిటివ్ విషయాల్లో ఏదైనా పరిష్కారం దొరికేది ఉందా అని ఆలోచన చేస్తా… వాటిల్లో పరిష్కారం రాని ఆలోచనలు ఉంటే.. తాను నెగిటివ్ విషయాలను రాసుకొన్న కాగితాన్ని కాల్చి పారేస్తాను అని ఉపాసన చెప్పింది. ఇలా చెయ్యడం వల్ల స్ట్రెస్ నుండి రిలీఫ్ లభిస్తుంది.. సంతోషంగా నిద్రపోతాను అని ఉపాసన చెప్పింది. అంతేకాదు.. ఈ సింపుల్ టెక్నిక్ ను ఫాలో అయ్యి తమ జీవితాల్లో ఎదురయ్యే నెగిటివ్ ఆలోచనలనుంచి స్ట్రెస్ నుంచి విముక్తి పొందమని ఉపాసనా మెగా అభిమానులకు టిప్స్ ఇస్తుంది.

ఉపాసనా స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడానికి కొత్తగాకనిపెట్టిన పేపర్ థెరపీ టాక్ ఆఫ్ ది మీడియాగా మారింది. మెగా అభిమానులకు మెగా హీరోలు చేసే సినిమాల అంశాలనే కాదు.. వారిలో వ్యక్త్విత్వ వికాసానికి సంబంధించిన కొత్త విషయాలను..సందర్భం బట్టి వంటలను.. ఈజీ పనులు చేసే టెక్నిక్ ను నేర్పుతూ చైతన్యం తీసుకొస్తుంది అని అంటున్నారు.

Comments

comments

Recent Posts