health

‘వయాగ్రా’ గాలితోనే వారికి ఆ కోరికలు !!

శృంగార సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఒక కొత్త ఉత్సాహం ఇస్తుంది వయాగ్రా. చాలా మంది ఏ సమస్యలూ లేకపోయినా, వయగ్రా ఇచ్చే కొత్త ఉత్తేజం కూడా ఈ టాబ్లెట్స్ వేసుకుంటారంటే ఆశ్చర్యం లేదు. అవసరమైన అంగాలకు రక్త ప్రసరణ వేగం పెంచి, సామర్ధ్యాన్ని పెంచే మాత్రలే వయాగ్రా. అయితే, మాత్రలు వేసుకోకుండా, కేవలం గాలి పీల్చడం ద్వారానే శృంగారకోరికల్ని రేకెత్తించవచ్చా..? ఏమో..ఐర్లాండ్ వాసులు అలా కూడా సాధ్యపడుతుందంటున్నారు.

రింగ్ స్కిడ్డీ..ఐర్లాండ్ లోని ఒక గ్రామం ఇది. ఈ గ్రామానికి పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు గానీ, దీనికి దగ్గర్లోనే వయాగ్రా మాత్రల్ని తయారుచేసే ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే గాలి వలన గ్రామంలోని ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారట. ఎంతలా అంటే, ఆ గాలి పీల్చడంతోనే గ్రామంలోని ప్రజల్లో శృంగార కోరికలు పెరిగిపోతున్నాయట. ఆఖరికి గ్రామంలోని కుక్కలకు కూడా ఈ గాలి వలన లైంగిక వాంఛలు పెరిగిపోతున్నాయని, ఇంటినుంచి బయటికొచ్చినా, వాకింగ్ చేస్తున్న సమయంలోనూ ఈ గాలి పీల్చక తప్పట్లేదని, దీంతో తమలో శృంగార వాంఛలు విజృంభిస్తున్నాయని, గ్రామస్తులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారట. విచిత్రంగా లేదూ..?

Comments

comments