చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’గా తెరకు పరిచయం. రాకేశ్ శశి దర్శకత్వంలో ‘విజేత’ తెరకెక్కింది. కల్యాణ్ దేవ్ సరసన కథానాయికగా మాళవిక నాయర్ నటించింది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించారు.
తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దంపట్టే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.కళ్యాణ్! నటనలో ఎలా రాణిస్తాడో అనే డౌట్స్‌కి చెక్ పెట్టి.. టైటిల్‌కి తగ్గట్టుగానే ‘విజేత’గా నిలిచాడు.
సినిమాలో అన్నీ వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొనేలా ఉంది. కళ్యాణ్ నటన బాగుంది. కుక్కురోకో.. సాంగ్ మాస్ కి పిచ్చి పిచ్చగా నచేలా ఉందని టాక్. మెగా ఫ్యామిలీ ఫోకస్ పెట్టడంతో విజేతకు భారీ రేంజ్ లో తెరకెక్కింది.నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు. సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
సంగీతం చాలా బాగుంది.పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది.కళ్యాణ్ లుక్స్ పరంగానే కాకుండా నటనపరంగానూ పరిణితి చూపించాడు. అక్కడక్కడ తేడా కొట్టొచ్చినట్లు అనిపించినా.. తొలిసినిమాకే అంత ప్రతిభ చూపడం గ్రేట్! ఇక మాళవిక శర్మ సింపుల్‌గా, బ్యూటిఫుల్ లుక్స్‌తో తళుక్కుమంది.మురళీ శర్మ ఎప్పట్లాగే తండ్రి పాత్రలో జీవించేశాడు. దర్శకుడు రాకేష్ శశి మంచి కథతో, సినిమాని బాగా తెరకెక్కించాడని తెలిసిపోతుంది.
ఈ నేపథ్యంలో తనికేళ్ల భరణి, కళ్యాన్ దేవ్ ల మద్య కొన్ని ఎమోషనల్ సన్నీవేశాలు..యువతను కదిలించేలా ఉన్నాయి. ఫస్టాఫ్ మొత్తం హీరో జులాయిగా తిరగడం చూపించినా..సెకండ్ ఆఫ్ లో తన మనసు మార్చుకొని హీరోయిన్ మాలవికా నాయర్ సహాయంతో జీవితంలో సెటిల్ ఎలా అయ్యాడు అనే విషయాన్ని దర్శకులు రాకేశ్ శశి బాగానే తీసినట్లు టాక్ వినిపిస్తుంది.
మురళీశర్మ, తనికెళ్ల భరణి, మాలవిక శర్మ, నాజర్ తమ పాత్రలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. కామెడీ పరంగా సత్యం రాజేష్ ఇతర క్యారెక్టర్ బాగానే నవ్వించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం నాట్ బ్యాడ్ అనిపించినా..పాటలు పెద్దగా ఆకర్షించుకోలేక పోయాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా పాత కథే కానీ కొత్తదనంగా చెప్పినట్లు ఉంది.
ప్లస్ పాయింట్స్ ;
హీరో పాత్ర
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్;
స్లో నేరేషన్
హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్
చివరిగా..
సినిమా అందరికీ నచ్చుతుంది. యువతకు మాత్రం కనెక్ట్ అయిపోతుంది.
రేటింగ్: 3/5
Add Comment