health

సహజంగా ఏర్పడే విటమిన్-B12 లోపాన్ని ఎలా అధిగమించాలి ?

సాధారణంగా మనం అనేక కారణాల వల్ల తరచుగా జబ్బు పడుతున్నాము. అలా జబ్బు పడటానికి గల కారణం మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. మందులు తీసుకోవటం ద్వారా ఆ రోగ లక్షణాలకు చికిత్సను అందిస్తున్నాము. అయితే ఈ విధానం, వ్యాధుల లక్షణాలను కొంతవరకు అణిచివేస్తుంది కానీ, పూర్తిగా అనారోగ్యాన్ని నయం చేయదు. మేము ఈ వ్యాసం ద్వారా, సహజంగా ఏర్పడే విటమిన్-B12 లోపాన్ని ఎలా అధిగమించాలో అనే విషయాన్ని గూర్చి తెలియజేయబోతున్నాము.

ఉదాహరణకు:- మీరు శరీర నొప్పులతో బాధపడితే, పెయిన్ కిల్లర్స్‌ను ఆశ్రయిస్తారు, అంతే గాని మీకు తరచుగా ఎదురయ్యే ఈ నొప్పికి కారణమైన విటమిన్ లోపాలు గూర్చి నిర్లక్ష్యం చేస్తారు.

ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల తయారీలో విటమిన్-B12 కీలక పాత్ర పోషిస్తుంది, ఆరోగ్యవంతమైన రోగనిరోధక వ్యవస్థకు కూడా ఇది చాలా అవసరం. ఇది రెగ్యులర్‌గా ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ప్రక్రియకు సహాయపడుతుంది & విటమిన్-B12 పైనే మెదడు పనితీరు ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

మీ శరీరం ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి ఈ విటమిన్ తగినంత స్థాయిలో లేనప్పుడు, విటమిన్-B12 లోపం సంభవిస్తుంది. ఇది కండరాల బలహీనత, నరాల సమస్యలు, ఆకలి లేకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, అలసట & రక్తహీనత వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది.

పాలు, షెల్ల్ఫిష్, గుడ్లు, మాంసం మొదలైన ఆహారాలలో విటమిన్-B12 సమృద్ధిగా దొరుకుతుంది. ఎక్కువ మంది శాకాహారులు విటమిన్-B12 లోపంతో బాధపడుతున్నారు. అయితే బాదంపాలు, కొబ్బరిపాలు, సోయా ఉత్పత్తులు, తృణధాన్యాలు, పుట్టగొడుగులు, మజ్జిగ తేట, జున్ను & పెరుగుల వంటి మరి కొన్ని శాఖాహారాలలో విటమిన్-B12 చాలా సమృద్ధిగా దొరుకుతుంది.

విటమిన్-B12 లోపాన్ని ఎలా అధిగమించాలి ?

విటమిన్-B12 లోపాన్ని అధిగమించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

1. పాల ఉత్పత్తులు విటమిన్-B12 కి అద్భుతమైన వనరులుగా ఉన్నాయి. ముడి పాలు, పెరుగు, జున్ను వంటి ఆహార పదార్థాలను తింటూ ఉండండి.

2. మీ ఆహారంలో పౌల్ట్రీ ఉత్పత్తులను, చేపలను, బీన్స్, గుడ్లు & నట్స్ వంటి ఆహారాలను చేర్చుకోవడం మంచిది.

3. చేపలు & ఎర్రని మాంసం వంటివి విటమిన్-B12 ను అధిక నాణ్యతతో కలిగి ఉంటాయి.

4. కొన్ని అల్పాహార తృణధాన్యాలు, పోషకాలను కలిగిన ఈస్ట్, మజ్జిగ తేట & బ్రెడ్ వంటి ఇతర ఆహార ఉత్పత్తులు విటమిన్-B12 తో మరింతగా బలపడతాయి.

5. పులియబెట్టిన సోయాబీన్లు కూడా విటమిన్-B12 కు అద్భుతమైన మూలాలు.

6. కెల్ప్ అనే నాచు, బ్లూ-గ్రీన్ ఆల్గే, బ్రూవర్ అనే ఈస్ట్ & పులియబెట్టిన మొక్కల ఆహారాలు; టేంపే-మిసో-టోఫు వంటి సముద్రపు మొక్కల వంటి వాటిలో విటమిన్-B12 సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.

7. మీరు లాక్టోస్కు విరుద్ధంగా గానీ ఉంటే, మీరు కనీసం 10 మైక్రోగ్రామ్‌ల విటమిన్-B12 సప్లిమెంట్స్‌ను రోజువారీగా తీసుకోవాలి (లేదా) ఒక వారానికి గానూ 2000 మైక్రోగ్రామ్‌ల విటమిన్-B12 సప్లిమెంట్స్‌ను తీసుకోవచ్చు.

Comments

comments