astrology

ఈ వారం మీ రాశి ఫలాలు 1 వ తేది నుండి 7 వ తేదీ వరకు

మరిన్నిupdates కోసం మా Facebook Telugu Frames Page నీ లైక్ చేయండి

మీనరాశి :

ఈ వారంలో అవివాహితులకు కుటుంబంలో వివాహ ప్రస్తావనలుంటాయి.ప్రతీ విషయాన్ని పెద్దల నిర్ణయంతో పూర్తి చేస్తే శుభం కలుగుతుంది.పరోపకారం,సామజిక ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.వారం మధ్యలో అంత అనుకూలం కాదు.ఒకరి అంతిమ కార్యక్రమానికి హాజరు అయ్యే అవకాశం ఉంది.మనస్సులో అశాంతి,ఆర్ధిక పరంగా కొంత ఇబ్బందులు,ఆరోగ్యభంగం వలన కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుటలో జాప్యం జరుగుట ఏర్పడుడును.క్రమ బద్ధికరణంగా ఉండే జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది.

కుంభరాశి :

ఈ వారం ప్రతీ పనిని ప్రశాంతగా నెరవేరుస్తారు.పనులలో లోతైన అధ్యయనాన్ని చేస్తారు.దైవ చింతన ఆధ్యాత్మీకంగా గడుపుతారు.దూరపు బందువుల నుండి అశుభవార్త వినవలసి వస్తుంది.కొంత ప్రతీకూలంగా కూడ ఉంటుంది.చేసే పనులలో జాప్యం వలన ఇతరులతో మాట పడవలసి వస్తుంది.పాత మిత్రుల కలయిక ఉంటుంది,పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని మురిసిపోతారు.రాజకీయ కార్యాలలో నిమగ్నం అవుతారు.ఆత్మ విశ్వాసం,మనోదైర్యం ఎక్కువతో ముందుకు సాగుతారు.వారాంతం పరోపకారానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు.

మకరరాశి:

 

ఈ వారం నమ్మిన వారితో చేదు అనుభవాలుంటాయి.మీ పనులలో ఏకాగ్రతతో నిమగ్నమైతే శుభఫలితాలు కనబడతాయి.కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి.నూతనంగా కాంట్రాక్ట్ పనులు లభిస్తాయి.పని ఒత్తిడిలు ఉన్నను వాటిని పూర్తి చేస్తారు.రావలసిన అప్పులలో కొంత భాగాన్ని వసూలు చేసుకో గలుగుతారు.వారం చివరలో ఒక వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.దైవ చింతనతో ఉండండి.

ధనస్సు రాశి :

ఈ వారం అవసరం ఉన్న వ్యక్తులకు సహాయంగా నిలిచి సంతోషం చెందుతారు.పాత కోప తాపలను,పట్టింపులను పక్కన పెడతారు.అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు.బహుమతులు పొందుతారు.వ్యాపారాలు మధ్యస్తంగా సాగుతాయి.మీ మాటపై మీరే నిలబడిని వ్యవహారం ఉంటుంది.ఇతరుల వ్యవహారంలో జ్యోక్యం చేసుకో కూడదు.కొత్తగా ప్రారంభించాలనుకున్న పనుల కంటే పాతవాటిపై దృష్టి సారించడం మంచిది.ప్రజా సంబంధాలు మెరుగు పడతాయి.మీరు దృష్టి సారించి చేసిన పనులకు గౌరవం దక్కుతుంది.

వృశ్చికరాశి :

ఈ వారం ఆర్ధిక పరమైన లాభాలుంటాయి.అందరితోను సహృదయంతో మెలుగుతారు.ఇల్లు మార్పు సూచనలు కనబడుతున్నాయి.మీకు ఆప్తులు,నచ్చిన వారు మంచి సూచనలు చేస్తారు.ప్రయాణాలకు అనుకూలంగా ఉంది.ఆరోగ్య పరమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం.పిల్లలు,కుటుంబ విషయాలలో ఆశాంతి నెలకోంటుంది.మానసిక భాదలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.బద్ధకాన్ని వదిలి వేయాలి.చేసే ప్రతీ పనిలో ఆత్మవిమర్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచింది.

తులారాశి :

ఈ వారం ప్రారంభంలోనే మంచి ఆనంద దాయంకంగా ఉంటుంది.ఆర్ధికంగా బలపడుతారు.కొన్ని సందర్భాలలో మాత్రం చాలా అప్రమర్తతతో ఉండాలి.ఆర్ధిక పరమైన విషయాలలో ముందు చూపుతో ఉండాలి,డబ్బుకు సంబంధింన విషయంలోఎవ్వరి నమ్మక స్వంతంగా చూసుకోవడమే మంచిది.ప్రతీ విషయంలో కొంత అసహనంతోనే పూర్తి చేస్తారు.దగ్గరి బందువర్గం నుండి అశుభ సమాచారం వినవలసిన పరిస్థితి కనబడుతుంది.వారం చివరలో మంచి కార్యసాధన,పనులలో విజయం.ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.

కన్యారాశి :

ఈ వారం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.ఆర్ధికంగా పెద్ద మార్పులేమి ఉండవు.డబ్బులు ఎలా వస్తాయో అలాగే ఖర్చు అవుతాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.బందువులను కలుసుకుంటారు.చేసే పనులలో నైపుణ్యం లేకపోతే నష్టం వస్తుంది.అనవసరమైన విరోదాలు ఏర్పడే అవకాశం ఉంది.గురుతుల్యుల వలన లాభాలు కలుగుతాయి.సమస్యల నుండి,శత్రువుల నుండి రక్షింప బడతారు.మీ సృజనాశక్తితో ఒక అసాధారన కార్యని నెరవేరుస్తారు.ప్రేమ వ్యవహారాలు,వివాహాలు,ఇతర విజ్ఞాన సంబంధమైన విషయలలో అనుకూలతలుంటాయి.

సింహం రాశి :

ఈ వారం ఆర్ధికంగా అభివృద్ధి కనబడుతుంది.ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.మిమ్మల్ని నమ్మిన వారిని,మీపై ఆధారపడిన వారిని చక్కగా చూసుకుంటారు.ప్రశాంతంగా కాలన్ని గడుపుతారు.పాత మొండి బాకీలు,మీకు రావలసిన డబ్బు సునాయసనంగా మీ చేతికి అందుతుంది.వ్యాపార,కుటుంబానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూల సమయం. మొండి తనం వీడి యుక్తిని ప్రదర్షించి పనులను చక్కబెట్టుకోవాలి.అవివాహితిలకు వివాహ సంబంధాలు ముడిపడతాయి.

కర్కాటకరాశి :

ఈ వారం కోరుకున్న విధంగా అత్యంత ప్రశాంతంగా పరిస్థితులు ఆనందంగా అనుభవిస్తారు.ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొంత నిరంతర శ్రమను పడుతారు.నలుగురితో కలిసిపోయే తత్వం,అమితమైన తెలివితేటల వలన ప్రగతిని సాధిస్తారు.ఇతరులకు సహాయపడుతారు,సమస్యను పరిష్కరిస్తారు.బంధువులతో అనుకూలమైన సత్సంబంధాలు ఏర్పడతాయి.ఆర్ధిక పరంగా సంతృపిగా ఉంటుంది.ఇన్ కంటాక్స్,సేల్స్ టాక్స్ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది అత్యంత జాగ్రత్తలు అవసరం.

మిథునరాశి :

ఈ వారంలో మానసికంగా ప్రశాంతగా ఉంటారు.ఆర్ధిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు.మీ దృక్ పధంలో మార్పు వలన చాలా వరకు మిమ్మల్ని పురోగతివైపు తీసుకవెలుతాయి.పాత స్నేహితులతో సత్సంబందాలు బలపడతాయి.వారి సహాయంతో కార్యవిజయం ఉంటుంది.భాధ్యతాయుతమైన మీ పనులను మీ శక్తి మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

వృషభరాశి :

ఈ వారం ఇంటా,వ్యావహారంలో సామాన్యంగా పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి.వ్యావహారంలో కొంత సవాలుగా ఉంటుంది.పనులలో అసంత్రుప్తి నెలకొంటుంది.మీపై రూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకొండి.అపోహలను నమ్మకండి.ఉద్యోగంలో మీ ప్రతిభకు లోటు ఉండదు.వారాంతంలో ఇంటికి సంబంధించిన ఒక నూతన వస్తువును కొనుగోలు చేస్తారు.మీ ప్రయత్నాలన్ని సఫలీకృతం అవుతాయి.శుభవార్త వింటారు.

మేషరాశి :

ఈ వారం మీ తెలివితేటలతో ప్రత్యర్ధులను సానుకూలంగా మరల్చుకుంటారు.ఎదుటివారి నుండి కాస్త జాగ్రత్తగా మసలుకోవడం అవసరం.వ్యావహారంలో కాని ఇతర ఏ విషయంలో కాని డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి,లేనిచో ఆర్ధికంగా నష్టం వాటిల్లు తుంది.కొంత ఆరోగ్య పరంగా,వ్యవహార పనుల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రారంభంలో కొంత మానసిక ప్రశాంతత తగ్గుతుంది.

Comments

comments