astrology

ఈ వారం మీ రాశి ఫలాలు 06 తేది నుండి 12వ తేదీ వరకు

మరిన్నిupdates కోసం మా Facebook Telugu Frames Page నీ లైక్ చేయండి

మీనరాశి :

మీన రాశి వారు ఈ వారం మీకు మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.వారం ప్రారంభంలో అంతరాయాలు ఏర్పడతాయి.మనస్సుకు నిలకడ ఉండదు.సభలు ,సమావేశాలలో పాల్గోంటారు.టెక్నాలజి రంగంవారికి అనుకూలంగా ఉంటుంది.వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సాటి వారితో ప్రేమ పుర్వకంగా వ్యవహరిస్తారు.వారం చివరలో మానసిక వ్యద ఉంటుంది.

కుంభరాశి :

కుంభరాశి వారు ఈ వారం అతిధులు,ఆత్మీయుల రాక ఉంటుంది.రాజకీయ పరమైన ఆసక్తి పెరుగుతుంది.ఎంత శ్రమపడితే అంతటి లానం చూస్తారు.ఆర్ధిక పెట్టుబడులలో చాలా బిజీ అవుతారు.ఇంటికొరకు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి.మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి,విభేదాలు కలిగే అవకాశం ఉంది.

మకరరాశి:

 

ఈ వారం పెద్దల,కుటుంబ సభ్యుల ఆశీస్సులు అందుతాయి.ఆస్థి తగాదాలు సంప్రధింపుల ద్వార పరిష్కారం లభిస్తుంది,లాభం చేకూరుతుంది.వారంతం పని ఒత్తిడి పెరుగుతుంది,ఒక చేదువార్త,అనుభవం ఏర్పడుతుంది.నమ్మిన వారి వలన మోసపోతారు జాగ్రత్తలు తీసుకోండి.వాహానాల విషయంలో జాగ్రత్తలు అవసరం.వారంతలో అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి :

ఈ వారం అనుకూలంగా ఉంటుంది.చేసే పనులలో అనుకూలతలు కనబడతాయి. స్నేహితుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.వారం మధ్యలోఅమ్త అనుకూలంగా లేదు.ఉదర సంబంధమైన అనారోగ్య సూచనలు ఉన్నాయి జాగ్రతలు తీసుకోవాలి.మాటలను అదుపులో పెట్టుకును వ్యవహరించాలి.మీ పనులకు ఎదుటి వారిపై ఆధారపడక స్వయంగా చేసుకుంటే లాభాలు కలుగుతాయి.

వృశ్చికరాశి :

వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొంత మెలుకువలు అవసరం.తొందరపాటు తనం వద్దు.డ్రైవింగులలో,ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు అవసరం. అందరితోను,ఇంటివారితోను అనుకువుగా ఉండాలి.ఇల్లు మార్చే అవకాశం ఉంది.ఆర్ధికంగా అనుకూలంగా ఉంటూంది.ఆత్మీయుల సలహాలు ఉపయోగపడతాయి.వారం మధ్యలో మీ ప్రణాళికలను పున:పరిశీలించుకోని కార్యచరణ చేపడుతారు.

తులారాశి :

తుల రాశి వారు ఈ వారం కుటుంబ సభ్యులతో గడుపుతారు.విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తారు.బంధు మిత్రులతో సహ ఉద్యోగులతో సత్ సంబంధాలు ఏర్పడతాయి.పరోపకారం వలన మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.పెండింగ్ పనులను వేగం చేసి విజయం సాధిస్థారు.ఇంటర్వులలో,పరీక్షలలో విజయం లభిస్తుంది.ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది.

కన్యారాశి :

ఈ వారం ప్రభుత్వ ఉద్యోగులకు లాభ సాటిగా ఉంటుంది.విద్యార్ధులు చదువులపై శద్ధ చూపిస్తారు.అన్ని అనుకూల వాతవరణాల కారంగా మనస్సుకు ప్రశాంతత నెలకొంటుంది.వారం చివరలో ఆర్ధిక పరమైన వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం.అతి సన్నిహిత వర్గమే ప్రతికూలంగా వ్యవహరిస్తారు.కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నను విజయం పొందుతారు.

సింహం రాశి :

ఈ వారం శుభపరినామాలు ఎక్కువగా ఉన్నాయి.నూతనంగా కొన్ని పనులను ప్రారంభిస్తారు.ఆత్మ విశ్వసంతో ముందుకు సాగుతారు.మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మార్పులు అవసం.వ్యాపార వ్యవహారాలు మంచి లాభ సాటిగా ఉంటాయి.రాజకీయ రంగం వారికి అనుకూప పరిస్తితులు ఉన్నాయి.అర్ధిక అనుకూలతల వలన మిలో మంచి ఉత్సాహం నెలకోంటుంది.

కర్కాటకరాశి :

ఈ వార ప్రారంభంలో మీకు ఇష్టం లేని వ్యావహారం కొనసాగుతుంది.ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారం మధ్య నుండి అనుకూలంగా ఉంటుంది.కోరుకున్న పనులను నెరవేర్చుకుంటారు,ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.మీ ప్రతిభకు సమాజంలో గుర్తింపు వస్తుంది.ఇతరులకు సహాయం చేస్తారు.బంధుత్వాలు బలపడతాయి.ఆదాయ పరంగా,వ్యవహార పరంగా మంచి అభివృద్ధి కనబడుతుంది.

మిథునరాశి :

మిధున రాశి వారు ఈ వారం ప్రతీ పనిలో విజయం సంతృపి కనబడుతుంది.ఇంటిని కాని వ్యావహారంలో అలంకరించుకోవటం జరుగును.ఉద్యోగంలో మార్పు సూచిస్తుంది.కొత్తగా వ్యాపార ప్రారంభ సూచనలు,అనుకూలతలు ఏర్పడనున్నాయి.మీ సృజనాత్మకమైన పనులు,నూతన విధానాన్ని అభ్యసించడం.ఉత్సహంలో పనులను చకచక చక్కబెట్టుకుంటారు.

వృషభరాశి :

ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి.శుభాశుభాలు కలిసి ఉంటాయి.కుటుంబంలో సోదరి,సోదరుల మధ్య మనస్తాపాలు తొలగిపోతాయి.మీ పై అధికారులు మీతీ సానుకూలంగా వ్యవహారిస్తారు.ఆధాయ పరంగా అనుకూలంగా ఉంటుంది.మీశ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.మీకు అత్యంత ఉపయోగ కరమైన వస్తువులను,పరికరాలను సమకూర్చు కుంటారు. వారం చివరలో ఆరోపనలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది జాగ్రత్త వహించండి.

మేషరాశి :

మేష రాశి వారికి ఈ వారం మంచి అనుకూల సమయం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులను చాకచక్యంతో పనులు నెరవేరుతాయి.మీ తలిదండ్రులు ,సంతానం మీకు దగ్గరౌతారు.గతం కంటే మేరుగైన స్థితిలో ఉన్నామన్న ఆ భావం మీలో కలుగుతుంది.ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది.మానసిక ప్రశాంతత లోపం ఏర్పడుతుంది.వారమ్ చివర్లలో మంచి అనుకూలంగా ఉంటుంది.

Comments

comments