astrology

ఈ వారం మీ రాశి ఫలాలు 15 తేది నుండి 21 వ తేదీ వరకు

మరిన్నిupdates కోసం మా Facebook Telugu Frames Page నీ లైక్ చేయండి

మీనరాశి :

ఈ వారంలో విద్యార్ధులకు కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి.విలాస వినోదాలు,ఫైనాస్స్ వ్యవహారాలు ప్రధానమవుతాయి.ఆర్దిక ప్రనాళికలు వేసుకుంటారు. మనస్సులో అశాంతి,ఆర్ధిక పరంగా కొంత ఇబ్బందులు,ఆరోగ్య భంగం వలన కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుటలో జాప్యం జరుగుట ఏర్పడును.

కుంభరాశి :

ఈ వారం మీ ఉదార స్వభావాన్ని చూసి అందరు గౌరవిస్తారు.మీకు నచ్చిన వారితో ఆత్మీయయతలు పంచుకుంటారు. పాత మిత్రుల కలయిక ఉంటుంది,పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని మురిసిపోతారు.రాజకీయ కార్యాలలో నిమగ్నం అవుతారు.ఆత్మ విశ్వాసం,మనోదైర్యం ఎక్కువతో ముందుకు సాగుతారు.వారాంతం పరోపకారానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు.

మకరరాశి:

 

ఈ వారం ఆస్తి తగాదలు పరిస్కారమవుతాయి.తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది.నోరు,కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. రావలసిన అప్పులలో కొంత భాగాన్ని వసూలు చేసుకో గలుగుతారు.నూతనంగా కాంట్రాక్ట్ పనులు లభిస్తాయి.పని ఒత్తిడిలు ఉన్నను వాటిని పూర్తి చేస్తారు.వారం చివరలో ఒక వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి.

ధనస్సు రాశి :

ఈ వారం ఉత్సహాం ఉరకలు వేస్తుంది.అవసరానికి మించి ఖర్చులు మానాలి.మీ మొండి తనం ఇతరులపై రుద్దకూడదు.కొత్తగా ప్రారంభించాలనుకున్న పనుల కంటే పాతవాటిపై దృష్టి సారించడం మంచిది.ప్రజా సంబంధాలు మెరుగు పడతాయి.మీరు దృష్టి సారించి చేసిన పనులకు గౌరవం దక్కుతుంది.

వృశ్చికరాశి :

ఈ వారం ఒత్తిడి ఉంటుంది.విజయం అనేది మినుకు మినుకులా కనబడుతుంది.ఓ గొప్ప వ్యక్తితో కలుసుకుంటారు.ఆరోగ్య పరమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం.కుటుంబ విషయాలలో ఆశాంతి నెలకునే అవకాశమ్ ఉంది.మానసిక భాదలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.బద్ధకాన్ని వదిలి వేయాలి.చేసే ప్రతీ పనిలో ఆత్మవిమర్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచింది.

తులారాశి :

ఈ వారం కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెడతారు.ఆర్ధిక ప్రనాళికలు చేసుకుంటారు.డబ్బుకు సంబంధింన విషయంలోఎవ్వరి నమ్మక స్వంతంగా చూసుకోవడమే మంచిది.ప్రతీ విషయంలో కొంత అసహనంతోనే పూర్తి చేస్తారు.దగ్గరి బందువర్గం నుండి అశుభ సమాచారం వినవలసిన పరిస్థితి కనబడుతుంది. వారం చివరలో మంచి కార్యసాధన,పనులలో విజయం.ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.

కన్యారాశి :

ఈ వారం తీరిక లేని వ్యవహారం ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు.దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. చేసే పనులలో నైపుణ్యం లేకపోతే నష్టం వస్తుంది.మీ ప్రవర్తనలో మార్పు సంభవిస్తుంది.భవిష్యత్ ప్లాన్ వేసుకోగలరు. అనవసరమైన విరోదాలు ఏర్పడే అవకాశం ఉంది.

సింహం రాశి :

ఈ వారం ప్రశాంతంగా కాలన్ని గడుపుతారు.పాత మొండి బాకీలు,మీకు రావలసిన డబ్బు సునాయసనంగా మీ చేతికి అందుతాయి. కుటుంబానికి ఆందోళనలు ఉండే అవకాశం ఉంది .రాజకీయ పరపతితో మీ సమస్యలు తీరుతాయి. వ్యాపార,కుటుంబానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూల సమయం.

కర్కాటకరాశి :

ఈ వారం మానసిక దిగులు,కొన్ని ఇబ్బందులు ఉప్పేనలాగ పుట్టుకోస్తాయి జాగ్రత్తలు అవసరం. ఇతరుల నుండి ఆశిస్తారు ,సమస్యను పరిష్కరిస్తారు.బంధువులతో అనుకూలమైన సత్సంబంధాలు ఏర్పడతాయి.ఆర్ధిక పరంగా సంతృపిగా ఉంటుంది.ఇంట్లో పెద్ద వాళ్లను చూసుకునే భాద్యత మీ పై పడుతుంది.

మిథునరాశి :

ఈ వారంలో పనులు సులభంగా నెరవేర్చుకుంటారు.ఆత్మస్తైర్యం పెరుగుతుంది.మంచి లాభదాయక ఉద్యోగం లభించే అవకాశం ఉంది.ఆరోగ్యం సహకరిస్తుంది.ఇంటికి సమ్బందించిన అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు.పోటిని తట్టుకుంటారు.వారం చివరలో ఆరోగ్యానికి సమ్బంధించి ఇతరత్ర చికాకులు కలిగే అవకాశాలున్నాయి.అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది.

వృషభరాశి :

ఈ వారం సంతృప్తి కరంగా ఉంటుంది.అనవసరంగా ఎవరితోను వాదాపవాదాలకు చాన్స్ ఇవ్వవద్దు.
మీపై రూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకొండి.అపోహలను నమ్మకండి.ఉద్యోగంలో మీ ప్రతిభకు లోటు ఉండదు.వారాంతంలో ఇంటికి సంబంధించిన ఒక నూతన వస్తువును కొనుగోలు చేస్తారు.మీ ప్రయత్నాలన్ని సఫలీకృతం అవుతాయి.శుభవార్త వింటారు.

మేషరాశి :

 

ఈ వారం సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.ప్రయాణ సంబంధమైన వ్యవహారాలలో లాభసాటిగా ఉంటుంది. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యావహారంలో కాని ఇతర ఏ విషయంలో కాని డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి,లేనిచో ఆర్ధికంగా నష్టం వాటిల్లు తుంది.కొంత ఆరోగ్య పరంగా,వ్యవహార పనుల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత మానసిక ప్రశాంతత తగ్గుతుంది.

Comments

comments