astrology

ఈ వారం మీ రాశి ఫలాలు 8 వ తేది నుండి 14వ తేదీ వరకు

మరిన్నిupdates కోసం మా Facebook Telugu Frames Page నీ లైక్ చేయండి

మీనరాశి :

ఈ వారంలో ప్రతీ విషయాన్ని పెద్దల నిర్ణయంతో పూర్తి చేస్తే శుభం కలుగుతుంది.పరోపకారం,సామజిక ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.శనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు.ప్రైవేటు రంగం వారు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.మీ అశ్రద్ధ ఆలస్యాల వలన కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. వారం మధ్యలో అంత అనుకూలం కాదు.మనస్సులో అశాంతి,ఆర్ధిక పరంగా కొంత ఇబ్బందులు,ఆరోగ్య భంగం వలన కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుటలో జాప్యం జరుగుట ఏర్పడును.

కుంభరాశి :

ఈ వారం వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు.స్థిరాచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం గోచరిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. దూర బందువుల నుండి అశుభవార్త వినవలసి వస్తుంది.కొంత ప్రతీకూలంగా కూడ ఉంటుంది.చేసే పనులలో జాప్యం వలన ఇతరులతో మాట పడవలసి వస్తుంది.పాత మిత్రుల కలయిక ఉంటుంది,పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని మురిసిపోతారు.రాజకీయ కార్యాలలో నిమగ్నం అవుతారు.ఆత్మ విశ్వాసం,మనోదైర్యం ఎక్కువతో ముందుకు సాగుతారు.వారాంతం పరోపకారానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు.

మకరరాశి:

 

ఈ వారం ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. వస్త్ర రంగాలలో వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి.కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి.నూతనంగా కాంట్రాక్ట్ పనులు లభిస్తాయి.పని ఒత్తిడిలు ఉన్నను వాటిని పూర్తి చేస్తారు.రావలసిన అప్పులలో కొంత భాగాన్ని వసూలు చేసుకో గలుగుతారు.వారం చివరలో ఒక వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

ధనస్సు రాశి :

ఈ వారం రాజకీయ రంగంలో వారికి కార్యకర్తల వలన చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మత్స్య, కోళ్ళ, గొఱ్ఱెల వ్యాపారస్తులు మెళకువ వహించండి. ఒక ప్రకటన మీకెంతో ఆందోళన కలిగిస్తుంది.అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు.వ్యాపారాలు మధ్యస్తంగా సాగుతాయి.మీ మాటపై మీరే నిలబడిని వ్యవహారం ఉంటుంది.ఇతరుల వ్యవహారంలో జ్యోక్యం చేసుకో కూడదు.కొత్తగా ప్రారంభించాలనుకున్న పనుల కంటే పాతవాటిపై దృష్టి సారించడం మంచిది.ప్రజా సంబంధాలు మెరుగు పడతాయి.మీరు దృష్టి సారించి చేసిన పనులకు గౌరవం దక్కుతుంది.

వృశ్చికరాశి :

ఈ వారం ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికి ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి.కంప్యూటర్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఇల్లు మార్పు సూచనలు కనబడుతున్నాయి.మీకు ఆప్తులు,నచ్చిన వారు మంచి సూచనలు చేస్తారు.ప్రయాణాలకు అనుకూలంగా ఉంది.ఆరోగ్య పరమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం.కుటుంబ విషయాలలో ఆశాంతి నెలకునే అవకాశమ్ ఉంది.మానసిక భాదలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.బద్ధకాన్ని వదిలి వేయాలి.చేసే ప్రతీ పనిలో ఆత్మవిమర్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచింది.

తులారాశి :

ఈ వారం స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. కొన్ని సందర్భాలలో మాత్రం చాలా అప్రమర్తతతో ఉండాలి.ఆర్ధిక పరమైన విషయాలలో ముందు చూపుతో ఉండాలి.డబ్బుకు సంబంధింన విషయంలోఎవ్వరి నమ్మక స్వంతంగా చూసుకోవడమే మంచిది.ప్రతీ విషయంలో కొంత అసహనంతోనే పూర్తి చేస్తారు.దగ్గరి బందువర్గం నుండి అశుభ సమాచారం వినవలసిన పరిస్థితి కనబడుతుంది.వారం చివరలో మంచి కార్యసాధన,పనులలో విజయం.ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.

కన్యారాశి :

ఈ వారం స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలం. పండ్ల వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఉమ్మడి నిధుల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి.స్థిరాస్తి, క్రమవిక్రయాలకు అనుకూలం.
స్నేహితులతో సరదాగా గడుపుతారు.బందువులను కలుసుకుంటారు.చేసే పనులలో నైపుణ్యం లేకపోతే నష్టం వస్తుంది.అనవసరమైన విరోదాలు ఏర్పడే అవకాశం ఉంది.గురుతుల్యుల వలన లాభాలు కలుగుతాయి.సమస్యల నుండి,శత్రువుల నుండి రక్షింప బడతారు.మీ సృజనాశక్తితో ఒక అసాధారన కార్యని నెరవేరుస్తారు.ప్రేమ వ్యవహారాలు,వివాహాలు,ఇతర విజ్ఞాన సంబంధమైన విషయలలో అనుకూలతలుంటాయి.పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.

సింహం రాశి :

ఈ వారం ఆర్ధికంగా అభివృద్ధి కనబడుతుంది.వ్యాపారంలో ఆశించినంత ప్రయోజనాలు సాధించడం కష్టం. బంధువుల రాకపోకలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. పెద్దల సహకారం లోపిస్తుంది. మిమ్మల్ని నమ్మిన వారిని,మీపై ఆధారపడిన వారిని చక్కగా చూసుకుంటారు.ప్రశాంతంగా కాలన్ని గడుపుతారు.పాత మొండి బాకీలు,మీకు రావలసిన డబ్బు సునాయసనంగా మీ చేతికి అందుతాయి.వ్యాపార,కుటుంబానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూల సమయం. మొండి తనం వీడి యుక్తిని ప్రదర్షించి పనులను చక్కబెట్టుకోవాలి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకరాశి :

ఈ వారం మీ వ్యక్తిగత భావాలను గోప్యంగా ఉంచండి. ఖర్చులు అధికమవుతాయి. ఒత్తిడి, నిరుత్సాహం ఎదుర్కుంటారు. తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొంత నిరంతర శ్రమను పడుతారు.నలుగురితో కలిసిపోయే తత్వం వలన ప్రగతిని సాధిస్తారు.ఇతరులకు సహాయపడుతారు,సమస్యను పరిష్కరిస్తారు.బంధువులతో అనుకూలమైన సత్సంబంధాలు ఏర్పడతాయి.ఆర్ధిక పరంగా సంతృపిగా ఉంటుంది.

మిథునరాశి :

ఈ వారంలో మానసికంగా ప్రశాంతగా ఉంటారు.ఆర్ధిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు.పెన్షన్, భీమా పనులు పూర్తవుతాయి.ఎవరితోను విభేదాలు పెట్టుకోవద్దు. జన సంబంధాలు మెరుగుపడుతాయి.ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వస్తుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది.మీ మనోభావాలకు మంచి స్పురణ లభించగలదు.స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.భాధ్యతాయుతమైన మీ పనులను మీ శక్తి మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.ఆర్ధిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

వృషభరాశి :

ఈ వారం కుటుంబంలో, వ్యావహారంలో పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి.వ్యావహారంలో కొంత సవాలుగా ఉంటుంది.పనులలో అసంత్రుప్తి నెలకొంటుంది.కోర్టుపనులు, లిటిగేషన్లు పరిష్కారమవుతాయి. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది. మీపై రూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకొండి.అపోహలను నమ్మకండి.ఉద్యోగంలో మీ ప్రతిభకు లోటు ఉండదు.వారాంతంలో ఇంటికి సంబంధించిన ఒక నూతన వస్తువును కొనుగోలు చేస్తారు.మీ ప్రయత్నాలన్ని సఫలీకృతం అవుతాయి.కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు.

మేషరాశి :

ఈ వారం మీ తెలివితేటలతో ప్రత్యర్ధులను సానుకూలంగా మరల్చుకుంటారు.ఎదుటివారి నుండి కాస్త జాగ్రత్తగా మసలుకోవడం అవసరం.ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి అవకాశాలు లాభిస్తాయి.కుటుంబంలో మనస్పర్ధలు తలెత్తె అవకాశాలున్నాయి.విద్యార్ధులు మంచి ఫలితాలు సాధిస్తారు. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యావహారంలో కాని ఇతర ఏ విషయంలో కాని డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి,లేనిచో ఆర్ధికంగా నష్టం వాటిల్లు తుంది.కొంత ఆరోగ్య పరంగా,వ్యవహార పనుల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

Comments

comments