health

జుట్టు రాలుటను నివారించడం ఎలా !?

మానవ శరీరంలో అరిచేతులు, అరికాళ్లు మినహా మిగిలిన అన్ని భాగాలలో వెంట్రుకలు పెరుగుతాయి. వెంట్రుకల కుదుళ్లలో కెరటిన్ అనే ప్రొటీన్ తయారవుతుంది. ఫోలికిల్స్ లో వెంట్రుకల కొత్త కణాలు ఏర్పడుతాయి. కొత్త కణాలు ఏర్పడినపుడు పాత కణాలు చర్మం పైకి తోసుకొని వస్తాయి.

ఆండ్రోజనిక్ అలోపేషియా (ఏజీఏ) అనే సమస్య స్త్రీపురుషులిద్దరిలో జుట్టు రాలిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. కొత్తగా వచ్చిన రెండు వెంట్రుకల్లో ఒకటి రాలిపోతుంది. ఇది జన్యుసంబంధమైన కారణాలతో వస్తుంది. స్త్రీ పురుషులలో ఎవరికైనా రావచ్చు. పురుషుల్లో ఈ సమస్య ఉన్నపుడు వారిలో టీనేజ్ నుంచి లేదంటే 20ల వయసులోనే జుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది.

ఆహారనియమాలు

సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు జుట్టు పెరగడానికి దోహదం చేస్తాయి. అవి మాత్రమే కాకుండా సీఫుడ్, మాంసం, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, చిక్కుడు జాతి గింజలు, ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అలా తీసుకోవడం వీలు పడని పక్షంలో డాక్టర్ సలహాతో విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చు.

  • మినరల్’లు ఎక్కువగా ఉన్న ఉదాహరణకు- కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి వాటిని అధికంగా ఉన్న ఆహర పదార్థాలను స్వీకరించండి.
  • ఆహారంలో విటమిన్ ‘A’, ‘B’, ‘C’ & ‘E’ అధికంగా ఉండేలా చూసుకోండి.
  • పచ్చని ఆకుకూరలు, క్యారెట్, ఆక్రోటు కాయలను ఎక్కువగా తినండి.
  • ఉల్లిపాయ రసం మరియు తేనెలను కలిపిన మిశ్రమాన్ని తలకు అద్దండి.
  • నిమ్మరసం, చుండ్రు మరియు జుట్టు రాలుటకు వ్యతిరేఖంగా పని చేస్తుంది.
  • సిగరెట్ తాగటం, ఆల్కహాల్ మరియు కెఫీన్ స్వీకరణను కూడా తగ్గించండి.
  • అధిక మొత్తంలో నీటిని తాగండి.
  • తాజా పండ్లను ఎక్కువగా తినండి.

Comments

comments