news

యూట్యూబ్ వీడియోస్ ఇప్పుడు వాట్సాప్ లో కూడా …

వాట్సప్ కొత్త ఫీచర్

వాట్సాప్‌ తమ కస్టమర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మెసేజ్ లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌ను వీడాల్సిన అవసరం లేదు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్‌ వినియోగదారుల కోసం ఈ సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది.

చాట్‌లో భాగంగా ఏదైనా యూట్యూబ్‌ వీడియో లింక్‌ను పంపిస్తే..ఇకపై ఆ వీడియోను వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. ఆ వీడియోను చూస్తూ చాట్‌ చేసుకోవచ్చు. ఇతర చాట్‌లోకి కూడా వెళ్లవచ్చు. గతంలో ఎవరైనా పంపిన యూట్యూబ్‌ వీడియో లింక్‌ను క్లిక్‌ చేస్తే అది యూట్యూబ్‌ యాప్‌లోకి వెళ్లి ప్లే అయ్యేది. దీంతో వాట్సాప్‌ నుంచి యూజర్‌ యూట్యూబ్‌కు వెళ్లాల్సివచ్చేది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేరుగా చాటింగ్ మధ్యలోనే వీడియోను చూసుకునే సదుపాయం లభించనుంది.

Comments

comments

Recent Posts