news

ఈ దేశంలో ఆడవారు ఆ పనులు చేయకూడదట.. చేశారో అంతే సంగతులు!!

మన దేశంలో పురుషులతో సమానంగా మహిళలు హక్కులు కలిగి ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే మగవారికంటే చాలా విషయాల్లో ఆడవారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించడంలో మనదేశం ముందుంటుంది. అటువంటిది సౌదీ లో మహిళలపై ఉన్న ఆంక్షలు వింటే ఆశ్చర్యపోక తప్పదేమో.. ఇక్కడి మహిళలు డ్రైవింగ్ కూడా చేయకూడదనే నిబంధన ఉండేది. దీంతో ఉద్యోగాలు చేస్తున్న చాలామంది మహిళలు డ్రైవర్ల కోసం ఎంతగానో వెచ్చించాల్సి ఉంటుంది. వారిని ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది.

దీంతో మహిళలు 1990ల నుండి తమకు డ్రైవింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అడుగుతూ వస్తుంటే ఇప్పటికి ఒప్పుకున్నారు. ప్రపంచంలో మహిళలు డ్రైవింగ్ చేసుకునే స్వాతంత్ర్ర్యం ఇచ్చిన చివరి దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. అయితే ఇంకా కొన్ని పనులు సౌదీ మహిళలు చేయకూడదు… వాటిలో కొన్ని…

మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా.. తిరగాలన్నా మగవాడు ఖచ్చితంగా వారి వెంట ఉండాల్సిందే. మహిళలకు పాస్ పోర్ట్ కావాలన్నా, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ప్రతి ఒక్కదానికి కూడా మగవాడు వెంట ఉండాల్సిందే.. వచ్చిన వ్యక్తి అనుమతి ఇవ్వాల్సిందే. లీగల్ మేల్ గార్డియన్ అన్న వ్యక్తి లేకుండా ఏ పని కూడా మహిళలు చేయలేరు అక్కడ..

మహిళలకు సంబంధించిన ఏ భాగం కూడా బయటకు కనపడకూడదు. ఖచ్చితంగా వారు పై నుండి కిందవరకూ బుర్ఖాతో కప్పేసుకోవాలి. తమ శరీర భాగాలు ఎంత వరకూ బయటకు కనపడాలో అక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అలాగే వారు వేసుకునే మేకప్ విషయంలో కూడా పరిమితులు ఉంటాయి.

బయట వ్యక్తులతో అక్కడి మహిళలు మాట్లాడడం నిషిద్ధం.. కొత్తగా తీసుకొని వస్తున్న డ్రైవింగ్ పాలసీ ద్వారా పోలీసులకు మహిళలతో ఎలా మాట్లాడాలో ఇంకా ఓ ఐడియా రాలేదు. ఒకవేళ బ్యాంకుకు వెళ్ళినా వారు అక్కడ ఉన్న లేడీ స్టాఫ్ తో మాట్లాడాలి తప్పితే.. మగవారితో కాదు. అయితే ఇవంతా పబ్లిక్ జిమ్, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ వాడకూడదు. ఆడవారు బయట ఉండే స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లలోకి అనుమతి అసలు ఇవ్వరు.

సాధారణంగా షాపింగ్ వెళ్ళినప్పుడు బట్టలు మనకు నచ్చితే..! అవి సెట్ అవుతాయా లేదా అని మనం ట్రయల్ రూమ్స్ కి వెళ్ళి చెక్ చేస్తాం..! కానీ అక్కడ ఆడవారు అలా చేయడం కుదరదు. మహిళలు బయట ట్రయల్ రూమ్స్ లో బట్టలు వేసుకోకూడదని రూల్ ఉంది.

Comments

comments