news

యూట్యూబ్ చానళ్లపై వేధింపులు!!?

సోషల్ మీడియాపై తెలుగుదేశం పార్టీ దాడిని తీవ్రం చేసింది. ఇటీవల పలువరు ఫేస్‌బుక్ యూజర్లపై తెలుగుదేశం వాళ్లు కేసులు పెట్టించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకా ఇది కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ఇది జరిగిందే. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మళ్లీ ఈ తరహా దాడులు తీవ్రం అయ్యాయి. నెటిజన్ల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ పనులు చేయిస్తోంది. ఆఖరికి ఫిరాయింపుదారులను ప్రశ్నించినా వాళ్లపై కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇలా తమను ప్రశ్నించే వారే లేకుండా చేసుకోవాలనేది చంద్రబాబు నాయుడి ప్రయత్నంగా తెలుస్తోంది.

కేవలం ఫేస్‌బుక్ యూజర్లకు మాత్రమే కాదు.. ఈ తరహా వేధింపులు ఇప్పుడు యూట్యూబ్ చానళ్ల వాళ్లకు కూడా మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత, తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శనాత్మక, వీళ్లు చేసిన తప్పులపై విశ్లేషణలను ఇస్తూ ఉన్న చానళ్లను తెలుగుదేశం గ్యాంగ్ లక్ష్యంగా చేసుకున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. యూట్యూబ్ శరవేగంగా విస్తరించిన మీడియా అని వేరే చెప్పనక్కర్లేదు. వార్తలు, విశ్లేషణలకు కూడా ఇప్పుడు నెటిజన్లు యూట్యూబ్ మీద ఆధారపడుతూ ఉన్నారు.

అలాగే నేతల మాటల్లో తప్పులు దొర్లే వీడియోలు కూడా యూట్యూబ్ లో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి నోరు జారే వ్యవహారాల్లో నారా లోకేష్ బాబు ముందుంటాడు అని వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికల ప్రచార సభల్లో, వివిధ ఇంటర్వ్యూల్లో లోకేష్ వ్యాఖ్యలు నవ్వుల పాలయ్యాయి. లోకేష్ నోరు జారిన వీడియోలు బాగా నవ్విస్తూ ఉంటాయి. యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు అప్ లోడ్ అయితే అవి సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి.

ఈ నేపథ్యంలో ఇలాంటి వీడియోలపై లోకేష్ గ్యాంగ్ కన్నేసినట్టుగా తెలుస్తోంది. లోకేష్ నోరు జారిన వీడియోలను డిలీట్ చేయాలని యూట్యూబ్ చానళ్ల వాళ్లపై ఒత్తిళ్లు చేస్తున్నారని తెలుస్తోంది. వాళ్లను హెచ్చరిస్తూ లోకేష్ నోరు జారిన వీడియోలను డిలీట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఈ విషయంలో రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. అలాగే కొన్ని వీడియోలపై యూట్యూబ్ కు ఫిర్యాదు చేస్తున్నారట. వాటిపై కాపీ రైట్స్ పిటిషన్లు ఇస్తూ వాటిని బ్లాక్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

మరి ఈ అతి తెలివితేటలతో లోకేష్ నెగిటివ్ వీడియోలను డిలీట్ చేయగలరేమో కానీ, ఇప్పటికే లోకేష్ పై జనాల్లో నాటుకుపోయిన అభిప్రాయాన్ని తొలగించగలరా?

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment