news

మోడి దెబ్బకి బ్యాంకు లోని డబ్బులన్నీ డ్రా చేస్తున్నారు..!

ఎఫ్‌.ఆర్‌.డి.ఐ. (ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌)… ఈ బిల్లుపైనే ప్రస్తుతం పల్లెల నుంచి పట్టణాల వరకు వాతావరణం వేడెక్కుతోంది. చివరకు పార్లమెంటు కూడా ఈ బిల్లుపై చర్చతో నిరసనలూ, మద్దతు వాదనలతో క్రమంగా రాజుకుంటోంది. నిజంగా ఈ బిల్లు వల్ల అంత నష్టం ఉంటుందా! నిజంగా నష్టపోతామా అనే సందేహాలు ఖాతాదారులను వేధిస్తున్నాయి. ఎఫ్‌.ఆర్‌.డి.ఐ. బిల్లులో ఏముందో, అమలవుతుందో లేదో కూడా తెలియకుండానే ఖాతాదారులు బ్యాంకుల్లోని తమ డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు ఎగబడుతున్నారు. పెద్ద బ్యాంకుల అధికారులు చాలావరకు నచ్చచెబుతుంటే, చిన్నబ్యాంకులు, కొన్ని ప్రయివేటు బ్యాంకులకు మాత్రం ఎద్దడి తప్పటం లేదు. అసలు బిల్లులో ఏముంది?

ఈ బిల్లు సారాంశం ఏంటనేది తెలిసేవరకు దానిపై ఒక నిర్ణయానికి రాలేమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఇది శుద్ధ దండుగ అని, బ్యాంకుల దివాళాకు, రుణ దోపిడీదారులకు ఊతం ఇచ్చినట్టుందని మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాలో మాత్రం ఎఫ్‌.ఆర్‌.డి.ఐ.పై సర్వత్రా నిరసనలే వ్యక్తమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నుంచి కోలుకోకముందే, ఆన్‌లైన్‌ లావాదేవీల విషయంలో ఒక కొలిక్కి రాకముందే ఈ బిల్లు తీసుకొస్తే వేల మంది విజయ్‌మాల్యాలు పుట్టుకొస్తారని ట్విటర్‌లలోనూ పోస్టులు పెడుతున్నారు.

సందేహాలు… ఆపోహలు ఎన్నో..

ఎఫ్‌.ఆర్‌.డి.ఐ. బిల్లు విషయంలో చాలావరకు సమాధానం లేని సందేహాలు చాలా ఉంటే, అపోహలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

కుమార్తె పెళ్లికో, పిల్లల చదువు కోసమో, వయసు పైబడ్డాక వైద్య ఖర్చుల కోసమోనని కష్టపడి సంపాదించుకున్న రూపాయి కూడబెట్టి, తక్కువ వడ్డీ అయినా డిపాజిట్‌ చేసుకున్న మొత్తాన్ని బ్యాంకులు మనకు సమాచారం కూడా ఇ వ్వకుండానే నగదు మళ్లించే అధికారం ఈ బిల్లు ద్వారా వస్తుందనేది ప్రధాన ఆరోపణ.

ఎవరో రూ. లక్షల్లో రుణాలుతీసుకుని బ్యాంకులకు ఎగవేస్తే, రుణం తీసుకునే వ్యక్తి స్థోమత, అతని వ్యక్తిత్వం తెలుసుకోకుండా భారీ రుణాలిచ్చిన బ్యాంకు సిబ్బందిని, రుణం తీసుకుని ఎగవేసి తిరిగే విజయ్‌ మాల్యాల వంటి వారిని ఏమీ చేయలేక వదిలేసి సామాన్యుని డిపాజిట్లపై పడటం ఎం తవరకు సమంజసంఅనేది మరో ప్రశ్న.

ఎన్నో నిబంధనలు, చట్టాలు కఠినంగా ఉన్నా, బ్యాంకర్లు ఇప్ప టికే చాలాచోట్ల కొందరు ఆ ర్థిక నేరగాళ్లతో చేతులు కలిపి రుణాల రూపంలో రూ.లక్షలుదోచేసిన సం దర్భాలు కళ్లముందే కనిపిస్తున్నా, ఇటు వంటిబిల్లు తీసుకొస్తే, అటువంటిబ్యాంకర్లకు అడ్డే ఉండదని, వారు చేసే మోసాలకు బ్యాంకులు దివాళా తీస్తే, దానికి డబ్బు దాచుకున్న సామాన్యులు ఎందుకు బాధ్యత వహించాలనేది మరో ప్రశ్న.

డబ్బు దాచుకునేవారే ఆ బ్యాంకు భద్రంగా ఉందో, లేదో అన్నీ విచారించుకుని డిపాజిట్లు చెయ్యాలని కొందరు నిపుణులు సూచిస్తుంటే, చిన్న బ్యాంకుల పరిస్థితి భవిష్యత్‌లో ఏమవుతుందనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుందంటున్నారు. దీని ప్రకా రం చేస్తే చాలావరకు చిన్న, ప్రయివేటు బ్యాంకులు మూతపడే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

బాండ్లు, సేవింగ్స్‌ ఖాతాలు, ఫిక్స్‌ డ్‌ డిపాజిట్ల వంటి వాటిపై అసలే వడ్డీ తక్కువే అయినా, తమ సొమ్ముకు భద్రత ఉంటుందని బ్యాంకుల్లో దాచుకుంటే, ఆ ఇచ్చే తక్కువ వడ్డీని కూడా రద్దుచేసే అధికారం, తగ్గించే అధికారం బ్యాంకుల కు కల్పించటం అన్యాయమనే అభి ప్రాయం మరొకటి ప్రచారంలో ఉంది.

అనేక అనుమానాలు రాజ్యమేలుతుంటే, చిన్న బ్యాంకుల్లో డిపాజిట్ల నుంచి పెద్ద బ్యాంకుల్లో డిపాజిట్లకూ కదలిక వస్తోంది. ఈ నెల రోజుల్లో భారీగానే డిపాజిటర్లు బ్యాంకుల చుట్టే తిరుగుతున్నారని బ్యాంకర్లే చెబుతున్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్న మాటలను కొందరు విని వెనక్కి వెళుతుంటే, అంత అవగాహన లేనివారు మాత్రం ఎందు కొచ్చిన చిక్కులని డిపాజిట్లు రద్దు చేసుకుంటున్నారు. అయితే ఇటువంటి పరిస్థితిలో మార్పురావాలంటే అసలు కొత్త బిల్లులో ఏముందనే విషయంపై స్పష్టత రావలసి ఉంది.

Comments

comments