news

మా డ్రింక్ తాగొద్దురా బాబోయ్ అంటున్నా మనం వదలట్లేదుగా..!

యూత్ అత్యధికంగా సేవించే కూల్ డ్రింక్ నిస్సందేహంగా థమ్సప్పే. బిర్యానీ తిన్నా, సమోసా తిన్నా, దానితో పాటు థమ్సప్ పార్టనర్ షిప్ ఉండాల్సిందే. కూల్ డ్రింక్ అన్నా, పురుగుల మందు అన్నా ఒక్కటే అని చాలా కాలంగా చాలామంది చెబుతూనే ఉన్నా మనకు పట్టదు. ఇప్పటికీ థమ్సప్ ను ఎత్తి, దించకుండా తాగేవాళ్లకు లెక్కలేదు. కానీ అదెంత ప్రమాదకరమో సాక్షాత్తూ ఆ కంపెనీ వాడే ప్రకటనల్లో ఇస్తున్నాడు చూడండి..!

సూపర్ స్టార్స్ తో ప్రకటనలు ఇప్పించే సదరు కంపెనీ వాడు, తాను యాక్ట్ చేసిన ఎడ్వర్టైజింగ్ లోఖచ్చితంగా కండిషన్స్ అప్లై అని రాయాల్సి ఉంటుంది. దాని ప్రకారం, “250 మి.లీ కూల్ డ్రింక్ లో 38.8 కెఫీన్ యాడ్ చేస్తున్నాం. ఇది అత్యధిక కేఫీన్ కలిగిన పానీయం. ఒక రోజులో 500 మి.లీ మించి తాగకూడదు. పిల్లలు, గర్భిణులు ఈ డ్రింక్ తాగరాదు” అని స్వయంగా కంపెనీ వాడే చెబుతున్నా, మనకు కనిపించటం లేదు.

మంచినీళ్లు తాగినంత ఈజీగా కూల్ డ్రింక్స్ తాగేస్తున్నాం కానీ, దాని వల్ల వచ్చే ప్రమాదాలు మాత్రం మనకు తెలియటం లేదు. సిగరెట్ల ప్యాకెట్లపై, మద్యం సీసాలపై హానికరం అని పెట్టినా మాననట్లే, థమ్సప్ ను కూడా లీటర్లకు లీటర్లు పట్టించేస్తున్నాం. ఇలాంటివన్నీ లోపలికి తోసేసి, ఆరోగ్యం ఎందుకు బాగుండట్లేదు అంటే ఎలా అండీ..?

Comments

comments