news

ఇంటర్నెట్ లో ఒక్క నిమిషంలో ఏమేం జరుగుతాయో తెలుసా?

ప్రపంచంలో 7.6 బిల్లియన్ల జనాభా ఉండగా అందులో 3.811 బిల్లియన్ల జనాభా ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు  అని తాజా సర్వేలో తేలింది. అయితే ఇందులో 2.9 బిల్లియన్ల జనాభా తరుచు సోషల్ మీడియా ఉపయోగించేవారు ఉన్నారు అని తేలింది. ప్రతి నిమిషానికి 14 మంది కొత్తగా ఇంటర్నెట్ వాడటం మొదలుపెడుతున్నారు.

 

ఇంటర్నెట్ అనగానే ఎక్కువగ ఉపయోగించేవి గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, నెట్ ఫ్లిక్, లింక్డ్ఇన్, స్నాప్ చాట్ ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు పాపులర్ మాధ్యమాల్లో ఒకో నిమిషంలో ఏమేం జరుగుతాయో తెలుసుకుందాం.

 

గూగుల్: ఒక్కో నిమిషానికి గూగుల్ లో 35 లక్షల ప్రశ్నలను వెతుకుతున్నారు.

 

ఫేస్ బుక్: ఒక్కో నిమిషానికి ఫేస్ బుక్ లో 9 లక్షల మంది లాగిన్ అవుతున్నారు మరియు 3.3 మిలియన్స్ పోస్ట్స్ పెడుతున్నారు. 4.1 మిలియన్స్ యూజర్లు పోస్ట్స్ కి లైక్స్ కొడతారు.

 

యూట్యూబ్: ఒక్కో నిమిషానికి యూట్యూబ్ లో 41 లక్షల వీడియోస్ చూస్తున్నారు అలాగే 500 పైగా వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి.

 

వాట్సాప్: ఒక్కో నిమిషానికి వాట్సాప్ లో 29 మిలియన్ల మెసేజెస్ వెళ్తున్నాయి.

 

ఇంస్టాగ్రామ్: ఒక్కో నిమిషానికి ఇంస్టాగ్రామ్ లో 65,972 ఫొటోస్ అప్లోడ్ అవుతున్నాయి.

 

ట్విట్టర్: ఒక్కో నిమిషానికి ట్విట్టర్ యూజర్స్ 4,48,800 ట్వీట్స్ పడుతున్నాయి.

 

ఈ-మెయిల్స్: ఒక్కో నిమిషానికి 1,49,513 ఈ-మెయిల్స్ పంపిస్తున్నారు.

 

స్నాప్ చాట్: ఒక్కో నిమిషానికి 18 లక్షల స్నాప్స్ సృష్టిస్తున్నారు.

 

నెట్ ఫ్లిక్స్: ఒక్కో నిమిషానికి నెట్ ఫ్లిక్స్ లో 70,017 గంటలు వీడియోలు చూస్తున్నారు.

 

లింక్డ్ఇన్: ఒక్కో నిమిషానికి లింక్డ్ఇన్ లో 12 కొత్త అకౌంట్స్ పుట్టుకొస్తున్నాయి.

 

స్కైప్: ఒక్కో నిమిషానికి స్కైప్ వినియోగదారులు 1,10,040 కాల్స్ చేసుకున్నారు

 

మెస్సెంజర్: ఒక్కో నిమిషానికి మెస్సెంజర్ లో 15,000 జిఫ్ ఫైల్స్ పంపుతున్నారు.

 

ఆన్ లైన్ షాపింగ్ : ఒక్కో నిమిషానికి 4 కోట్ల 90 లక్షల వ్యాపారం జరుగుతుంది.

 

గూగుల్ ప్లే/ అప్ స్టోర్ : ఒక్కో నిమిషానికి 3 లక్షల 42  యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

 

పింటరెస్ట్ : ఒక్కో నిమిషానికి 9,722 మంది యూజర్లు ఫొటోస్ ని పిన్ చేస్తారు.

 

వర్డ్ ప్రెస్ : ఒక్కో నిమిషానికి వర్డ్ ప్రెస్ లో 1,440 పోస్ట్లు పెడుతున్నారు.

Comments

comments