politics

నా మద్దతు ఆ పార్టీకే…..

మాటతప్పని మడమ తిప్పని నాయకుడు(జగన్) తన పాదయాత్రలో ఒక్కో సభలో ఒక్కో రకంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన కాపు సేవ సమితి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముద్రగడ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు రూ.5వేలు కోట్లు ప్రకటిస్తే, వైకాపానేత జగన్‌ రూ.10వేల కోట్లకు తమను కొనడానికి సిద్దమవుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.20వేల కోట్లు ఇస్తాం ముఖ్యమంత్రి పదవి కాపులకుగాని బీసీ లకు, దళితులకు ఇస్తారా? అని జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ విసిరారు.

సీఎం చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ హామీని కేంద్రం పరిధిలో నెట్టివేయకుండా, చిత్తశుద్ధితో అమలు చేయాలని బాబును కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కాపు రిజర్వేషన్ ను 9వ షెడ్యూల్ లో చేర్చి అమలు చేయాలన్న వ్యాఖ్యలను ముద్రగడ ఏకీభవించారు. జగన్ రాజ్యాంగాన్ని చదివినట్లు మొసలి కన్నీరు కార్చవద్దని, ఆయన సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. కాపులకు ఏ పార్టీ న్యాయం చేస్తే,2019లో ఆపార్టీ పల్లకి మోస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.

Comments

comments