news

25 ఏళ్ళ లోపు పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎన్ని లాభాలో !!!

ఏరా అబ్బాయ్, ఇంకెప్పుడు రా పెళ్ళి చేసుకొనేది? నీ తోటి స్నేహితులందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మన ఊళ్ళో, మనకు బాగా తెలిసిన కుటుంబాల్లో, ఇద్దరు అమ్మాయులున్నారు. మంచి సంబంధాలు. అమ్మాయులు కుందనపు బొమ్మల్లా వుంటారు. చదువుకున్నవాళ్ళు. వాళ్ళు మనకు పాతిక సంవత్సరాలకుపైగా తెలుసు. ఆస్తిపాస్తులున్న వాళ్ళు. కట్నకానుకలు ఇచ్చుకొనే స్తోమత గలవాళ్ళు. అమ్మది ఒకటే పోరు. ఇలా ప్రతి తల్లిదండ్రులు ఎదో ఒక సమయానికి అబ్బాయిలను అమ్మాయిలను పెళ్ళికి తొందరపెడుతుంటారు…అసలు ఎందుకు పెళ్లి తొందరగా చేసుకోవాలి…అనే ప్రశ్న దాదాపు అందరికి వస్తుంది…ఇక విషయానికి వస్తే…

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో వివాహ‌బంధం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్న‌ది కూడా. వివాహం అంటే కేవ‌లం శారీర‌క తోడు కోస‌మే కాదు.. జీవితాంతం తోడునీడ‌గా,, క‌ష్ట‌సుఖాల్లో పాలు పంచుకోవ‌డంలో సాయ‌ప‌డుతుంది. ఒడిదుడుకుల‌కు ఒక‌రికి ఒక‌రు స‌హాయప‌డ‌తారు. కానీ ఈ వివాహం ఒక నిర్ణీత వ‌య‌సులో చేసుకుంటేనే జీవితం సార్థ‌క‌మ‌వుతుంది. ఎంతో అన్యోన్య‌త‌తో పాటు చాలా ఎక్కువ కాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలాసాఫీగా సంసార నావ ఒడ్డుకు చేరుతుంది….లేటు వయసు వివాహం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అయితే లేటు వయసులో పెళ్లి, పిల్లలంటే లేనిపోని సమస్యలు తప్పవు. పిల్లలు ఎదిగే కొద్దీ వయసు మీద పడటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అందుకే లేటు వయసు వివాహాల్ని చాలామటుకు తగ్గించడం ఉత్తమం. 35 సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రులయ్యే వారికి పిల్లల భవిష్యత్‌తో పాటు వారి భద్రతపై కూడా ఆర్థిక సమస్యలు వేధిస్తునూ ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా పిల్లల భవిష్యత్‌పై లేటు వయస్సులో మ్యారేజ్ చేసుకున్న వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 25 సంవత్సరాల వయసుతో పోలిస్తే 40 ఏళ్లంటే… సంపాదించే సమయం 15 ఏళ్లు తగ్గిపోయి వుంటుంది. చిన్నారుల భవిష్యత్ ఆందోళనకరం కాకుండా ఉండాలంటే, మరింత సమయం మించిపోకుండా సత్వర నిర్ణయాలు తీసుకోవాలన్నది నిపుణుల అభిప్రాయం.లేటు వయసులో తల్లిదండ్రులైతే.. ఆ వెంటనే సాధ్యమైనంత ఎక్కువగా పొదుపు చేయడం ప్రారంభించాలి. లగ్జరీలను, టూర్లను తగ్గించుకోవాలి. ముఖ్యంగా యాత్రలు, విదేశీ ప్రయాణాల వంటివి లైఫ్ స్టయిల్ నుంచి తొలగించి ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే, దీర్ఘకాలంలో ఆకర్షణీయ మొత్తంగా మారుతుంది. సంవత్సరానికి ఒకేసారి పెద్ద మొత్తం ప్రీమియాలు చెల్లించకుండా, వాటిని త్రైమాసిక, నెలసరి వాయిదాల రూపంలోకి మార్చుకుంటే, పెద్దగా భారం అనిపించదు.

చదువు, మంచి ఉద్యోగం, ఆదాయం, మానసిక-శారీరక పరిణతి వంటివి ప్లస్‌ పాయింట్లు. ఆర్థికాంశాలకు అధిక ప్రాధాన్యత… భాగస్వామికి ద్వితీయ ప్రాధాన్యత. వారికోసం అంత సమయం కేటాయించలేరు. సంసార జీవితంపైనా ప్రభావం వుంటుంది. వయసు పైబడడంతో వెంటనే పిల్లల కోసం పరుగులు తీయాల్సి వస్తుంది.ప్రసవ వేళ ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావడం మైనస్‌ పాయింట్లు.స‌రైన స‌మ‌యంలో పెళ్లి చేసుకుంటే ఎక్కువ‌కాలం సుఖమ‌యంగా జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. అలాకాకుండా ఎటూకాని వ‌య‌సులో అంటే ముందుగానో లేక లేటు వ‌య‌సులోనే పెళ్లి చేసుకుంటే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వివాహ బంధంపై అవి చూపుతాయి. అయితే ఆ వ‌య‌సు ఎంత ఉండాలో తెలుసుకుందామా.. దేశంలో ఎనిమిదేళ్ల ఏళ్ల పాటు నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం 28-32 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న‌వారు వివాహం చేసుకుంటే చాలా చ‌క్క‌గా, జీవితాన్ని సుఖ‌మ‌యం చేసుకోవ‌చ్చ‌ట‌.

ఈ వ‌య‌సులో ఉన్నపురుషులు, స్త్రీలు చాలా ప‌రిణితి చెంది ఉంటార‌ట‌. ఈ ప‌రిణితి వ‌ల్ల జీవితంలో ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదురైనా త‌ట్టుకుని నిల‌బ‌డే మ‌న‌స్త‌త్వం ఏర్ప‌డుతుంద‌ట‌. వైవాహిక జీవితానికి ఇబ్బందులు లేకుండా స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించే ధీమా వ‌స్తుంద‌ని 28-32 ఏళ్ల వ‌య‌సు వివాహానికి స‌రైన స‌మ‌యం అని ప‌రిశోధ‌న‌లో తెలియ‌జేశారు. సో.. మీరు కూడా ఈ వ‌య‌సులోనే పెళ్లి చేసుకుని జీవితం ఎంజాయ్ చేయండి.

Comments

comments