news

జనవరి 15న అమలాపాల్ పోలీస్టేషన్ లో హాజరుకాకపోతే ఏమవుతుందో తెలుసా?!!

హీరోయిన్ అమలాపాల్ త్వరలోనే కేరళా పోలీసుల ముందుకు హాజరవనుంది. ఇటీవల ఖరీదైన కారుని కొనుగోలు చేసిన ఈ అమ్మడు.. పుదుచ్చేరిలో నకిలీ ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేయించిన విషయం వెలుగులోకి రావడంతో చిక్కుల్లో పడింది. ట్యాక్స్‌ నుంచి తప్పించుకునేందుకే ఈ విధంగా అమలాపాల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

ఈ విషయాన్ని స్వయంగా పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి ఈ మోసాన్ని వెలుగులోకి తీసుకురావడంతో హుటాహుటిన కదలిన కేరళ పోలీసులు అమలాపాల్‌పై పన్ను ఎగవేత కేసుని నమోదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈ హీరోయిన్‌కి నోటీసులు జారీ చేసినా… సరైన స్పందన లేకపోవడంతో తాజాగా పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు.

Comments

comments