movies

భాగమతి ఓవర్సీస్ రైట్స్…..రికార్డ్ లెవల్ రేటు!!

టాలీవుడ్ బొమ్మాలి అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ భాగమతి….భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తి అవ్వగా ఇప్పుడు గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. కాగా సినిమా బిజినెస్ ఇప్పటి నుండే జోరు అందుకోగా సినిమా సంక్రాంతి బరిలో నిలిచే చాన్స్ ఉంది.భాగ‌మ‌తి’.. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ వ‌చ్చే వ‌ర‌కు ఈ సినిమా మీద ఎలాంటి అంచ‌నాలు లేవు. ఎప్పుడైతే అనుష్క పుట్టిన‌రోజున ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారో.. అప్ప‌ట్నుంచి ఈ సినిమా టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు అంత కంటే హాట్ టాపిక్ ఏమిటంటే.. ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిందన్న‌ది అయితే టాలీవుడ్ ఈ రేటు చూసి అందరు  ఆశ్యర్యపోతున్నారు. ‘బాహుబలి 2’ ఇచ్చిన హైప్ తో అందులో నటించిన నటులందరికీ ప్రస్తుతానికి మార్కెట్, టైం రెండూ బాగానే ఉన్నాయి. అందులోనూ ఇది అనుష్క నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ ఫిలిం కావడం విశేషం. గతంలో అనుష్క  చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘అరుంధతి’ ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కరలేదు. అందులోనూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆస‌క్తిక‌రంగా ఉండి ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ‘పిల్ల జ‌మీందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్త నిర్మాణంలో తెర‌కెక్కింది. ప్రమోద్, వంశీ నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది.

తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళంలోనూ ఈ సినిమా విడుద‌ల కానుంది. కాగా, ఈ సినిమా  త‌మిళ్ రైట్స్ భారీ రేటుకి ప‌లికాయ‌ని తెలిసింది. రూ.15 కోట్ల మొత్తంతో స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింద‌ట‌. సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానుంద‌ని స‌మాచార‌.

 

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment