politics

జనసేన పార్టి ని విలీనం చేయమని బీజేపీ వార్నింగ్ ??

పవన్ కళ్యాణ్ శనివారం ఒంగోలులోని జనసేన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాటల్లో, తనను బీజేపీలోకి రమ్మంటూ ఆఫర్ వచ్చిందని, అయినా కానీ తాను వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఆయనేమన్నారంటే..

“కొన్నాళ్ల క్రితం, అమిత్ షాను కలిశాను. పవన్ జీ..భవిష్యత్తు జాతీయపార్టీలదే తప్ప ప్రాంతీయపార్టీలకు భవిష్యత్తు లేదు అంటూ ఆయన మాట్లాడారు. మాటల మధ్యలో, మీరు బీజేపీలోకి వచ్చేయండి అన్నారు. నాకు అధికారం, కీర్తి, వద్దు, డబ్బు, ఇవన్నీ పోయినా, మీకు ఇచ్చిన మాటను మాత్రం వదిలే ప్రసక్తి లేదు.

ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకుంటాం అని ఆయన అనడం, అన్నం పెట్టిన చేయిని నరకడమే అవుతుంది. బీజేపీ కూడా సింగిల్ డిజిట్ ఎంపీ పార్టీగా మొదలైంది. ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది. అది ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రశ్నించేందుకు నేను వెనుకాడను. ఎన్నడూ ఎవరిదగ్గరా చేయి చాచలేదు. ఒక్క రూపాయి తీసుకోలేదు. అందుకే నాకు భయం లేదు.” అని పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటల్ని వెల్లడించారు.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment