news

ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్…

ఇప్పటివరకూ మనం ఏ, బీ, ఎబీ, ఓ బ్లడ్ గ్రూపుల గురించేవిన్నాం. కానీ దీనికితోడుగా మరో బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 43 మంది దగ్గరమాత్రమే ఉంది. ఈ గ్రూప్ పేరు రీసస్ నెగిటివ్(RH Null). దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి శరీరంలోని యాంటీజెన్ కౌంట్ ఆధారంగా వారి బ్లడ్ గ్రూప్‌ను తెలుసుకోవచ్చు. అయితే ఎవరి శరీరంలోనైనా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్‌ను రేర్ గ్రూప్‌గా పరిగణిస్తారు. యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది. అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది.

 

అయితే ఎవరి దగ్గరైతే రీసస్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో వారు తమ బ్లడ్ దానంచేసి ఇతరుల ప్రాణాలు కాపాడగలుగుతారు. గడచిన 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది. రీసస్ నెగిటివ్ బ్లడ్ కలిగినవారు ప్రపంచంలో ఎవరికైనా సరే రక్తదానం చేయగలుగుతారు.

ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగినవారు సాధారణ మనుషుల్లానే ఉంటారు. అయితే వీరు తమపై తాము మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరికి బ్లడ్ గ్రూప్ డోనర్ దొరకడం చాలా కష్టం.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment